News September 20, 2025

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. భక్తుల విన్నపాలు ఇవే

image

➣దూర ప్రాంతాల భక్తులకు బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలి. లాకర్ సౌకర్యం కల్పించాలి.
➣ప్రసాదాల వద్ద సరిపడా చిల్లర తెచ్చుకోవాలనడంతో ఇబ్బంది. డిజిటల్ పేమెంట్లకు అవకాశం కల్పించాలి.
➣కేశఖండన శాలల వద్ద డబ్బులు వసూళ్లపై నియంత్రణ.
➣వాష్ రూమ్స్ సరైన మెయింటెన్స్ లేకపోవడం
➣క్యూలైన్లో మజ్జిగ, బిస్కెట్స్ లాంటివి అందించడం
➣మాలలు అమ్మవారి గుడిలోనే తీసేలా చర్యలు

Similar News

News September 20, 2025

రేపు వనపర్తికి రానున్న మంత్రి వాకిటి శ్రీహరి

image

క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం వనపర్తికి రానున్నారు. పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఉదయం 11:00 గంటలకు నిర్వహించే సేపక్ తక్రా జిల్లాస్థాయి టోర్నమెంట్ పోటీలను మంత్రి ప్రారంభించనున్నట్లు జిల్లా పౌర సంబంధాలశాఖ అధికారి సీతారాం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి,స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి, MLA మెఘారెడ్డిలు పాల్గొంటారని పేర్కొన్నారు.

News September 20, 2025

విజయవాడ: APCRDA అడిషనల్ కమిషనర్‌గా భార్గవ్ తేజ

image

APCRDA అడిషనల్ కమిషనర్‌గా అమిలినేని భార్గవ్ తేజ ఐఏఎస్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం CS కె.విజయానంద్ ఉత్తర్వులిచ్చారు. 2018 బ్యాచ్‌కు చెందిన భార్గవ్ తేజ గతంలో కందుకూరు సబ్ కలెక్టర్‌, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌ (హౌసింగ్), కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌‌గా విధులు నిర్వర్తించారు.

News September 20, 2025

H1B వీసా: 2 గంటల్లోనే భారీగా పెరిగిన టికెట్ ధర

image

H1B వీసాదారులు రేపటిలోగా USలో ఉండాలన్న <<17769573>>నిబంధనను<<>> విమానయాన సంస్థలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు ఇప్పటివరకు టికెట్ ధర రూ.34-37వేలు ఉండగా దాన్ని రూ.70-80వేలకు పెంచాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన 2 గంటల్లోనే ధరలు భారీగా పెంచడం గమనార్హం. దుర్గాపూజ కోసం చాలామంది వీసాదారులు US నుంచి INDకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా ఉరుకులు పరుగుల మీద USకు బయల్దేరుతున్నారు.