News September 20, 2025
కాసేపట్లో వర్షం..

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. యాదాద్రి భువనగిరి, జనగాం, నల్గొండ, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో వర్షం పడుతుందని అంచనా వేశారు. అటు హైదరాబాద్‌లో రాత్రి సమయంలో వర్షం పడుతుందని పేర్కొన్నారు.
Similar News
News September 20, 2025
H1B వీసా నిబంధనపై స్పందించిన భారత్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన H1B వీసా నిబంధనపై భారత్ తొలిసారి అధికారికంగా స్పందించింది. తాజా పరిణామాలను పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ఇది ఇరుదేశాల్లోని సంస్థలను ప్రభావితం చేస్తుందన్నారు. ఎన్నో కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెడుతుందని స్పష్టం చేశారు. H1B నిబంధనలతో తలెత్తే ఇబ్బందులను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశిస్తున్నట్లు జైస్వాల్ చెప్పారు.
News September 20, 2025
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. APPLY

AP: SC, ST, BC, OC నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అంబేడ్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. IBPS, RRB, SSC వంటి పోటీ పరీక్షల కోసం తిరుపతి, విశాఖ కేంద్రాల్లో శిక్షణ ఇస్తామని, ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 24 నుంచి OCT 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9949686306 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
News September 20, 2025
ట్రంప్ నిర్ణయంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం: శ్రీధర్ బాబు

TG: H1B వీసా ఛార్జీలను పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రానికి తీవ్ర నష్టమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘మన రాష్ట్రం నుంచి అమెరికాకు చాలామంది వెళ్లారు. ఇక్కడ కుటుంబాలు వాళ్లు పంపించే మనీ పైనే ఆధారపడుతున్నాయి. TCSలో లక్ష మంది, విప్రోలో 80 వేలు, ఇన్ఫోసిస్‌లో 60 వేల మంది USలో పనిచేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంపై PM మోదీ మౌనం వెనుక ఉన్న ఆంతర్యమేంటి. USతో కేంద్రం చర్చలు జరపాలి’ అని కోరారు.