News April 5, 2024

నేడు కాంగ్రెస్‌లో చేరనున్న డా.కిల్లి కృపారాణి

image

టెక్కలికి చెందిన మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపారాణి శుక్రవారం కడప జిల్లా బద్వేల్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆమె కార్యాలయ వర్గాలు తెలిపాయి. బద్వేల్‌లో ఏపీపీసీసీ చీఫ్ YS.షర్మిల బస్సుయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో ఆమె సమక్షంలో కృపారాణి పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే కృపారాణి బద్వేల్ చేరుకున్నారు. ఈసారి టెక్కలి అసెంబ్లీ నుండి కృపారాణి పోటీ చేస్తారని సమాచారం.

Similar News

News January 19, 2026

అరగంటలోనే సూర్య భగవానుడి దర్శనం: SKLM కలెక్టర్

image

రథసప్తమి పర్వదినాన అరసవల్లికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గతంలో 45 నిమిషాలు పట్టే దర్శన సమయాన్ని ఈసారి 30 నిమిషాలకే తగ్గించేలా 6 ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు. ఉచితంతోపాటు రూ.100, రూ.300,రూ.500 టికెట్లు కూడా ఆన్లైన్, ఆఫ్లైన్లో అందుబాటులో ఉన్నాయన్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు రావచ్చన్నారు.

News January 19, 2026

ఉచిత పశువైద్య శిబిరాల పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి అచ్చెన్న

image

ఏపీలో ఉచిత పశు వైద్య శిబిరాలు తేదీల షెడ్యూల్ పోస్టర్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం తాడేపల్లిలోని కార్యాలయంలో ఆవిష్కరించారు. రైతులు శ్రేయస్సుకు కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగానే పాడి పశువులను పోషించేందుకు ప్రోత్సహిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పాడి సంపద అభివృద్ధి చేయాలని తెలియజేశారు.

News January 19, 2026

మెళియాపుట్టి: ‘వినోదం కోసం వెళ్తే విషాదం ఆవరించింది’

image

వినోదం కోసం పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఆడలి వ్యూ పాయింట్‌కు వెళ్లిన కుటుంబంలో విషాదం నింపింది. నిన్న సాయంత్రం ఏజెన్సీలో ప్రకృతి అందాలను చూసి తిరిగి ఆటోలో వస్తుండగా..వారి వాహనం ఆడలి వ్యూ పాయింట్ వద్ద రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంద్రరావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు మెళియాపుట్టి మండలానికి చెందిన వారిగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.