News September 20, 2025
విజయనగరంలో దంపతుల ఆత్మహత్య

విజయనగరం వీటీ అగ్రహారంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అగ్రహారంలో నివాసముంటున్న కానూరి పార్వతి (55), సత్యనారాయణ(62) కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి ఇంట్లో పడుకున్నారు. ఉదయం ఎంతకీ లేవకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ ఎస్‌ఐ అశోక్ కుమార్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. వారు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలింది.
Similar News
News September 20, 2025
క్రీడాకారులను అభినందించిన కలెక్టర్

తూ.గో జిల్లా యువ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ కప్ – 2025లో సాధించిన విజయంపై కలెక్టర్ కీర్తి చేకూరి అభినందనలు తెలిపారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో క్రీడాకారులు కలెక్టర్‌ను కలుసుకొని, తమ అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు గౌరవం తీసుకొచ్చిన మీరంతా ఇతరులకు ఆదర్శం, మీ కృషి ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.
News September 20, 2025
వరంగల్ ఎంజీఎంలో మళ్లీ దారుణం..!

వరంగల్ ఎంజీఎంలో మరోసారి వైద్యుల నిర్లక్ష్య ధోరణి బట్టబయలైంది. కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామానికి చెందిన జ్యోతి బ్లడ్ తక్కువ ఉండటంతో ఈనెల 16న ఎంజీఎంలో చేరింది. పరీక్షలు చేసి రక్తం తక్కువగా ఉందని తేల్చిన వైద్యులు తన గ్రూపు O+ రక్తం ఎక్కించాలని సూచించారు. ఈనెల 17, 18న రెండు రోజుల్లో O+ రక్తానికి బదులుగా B+ బ్లడ్ ఎక్కించారు. 19న బ్లడ్ కావాలని శాంపిల్స్ చూడటంతో O+ గ్రూప్ ఉండటంతో అవాక్కయ్యారు.
News September 20, 2025
శ్రీశైలంలో దసరా మాసోత్సవాలకు అన్ని ఏర్పాట్లు: ఈవో

ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈవో మాట్లాడారు. భక్తులందరికీ శ్రీ స్వామి, అమ్మవార్ల సంతృప్తికర దర్శన భాగ్యం కలిగించేలా ఏర్పాట్లు సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 1న దేవాదాయ శాఖ మంత్రి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు.