News September 20, 2025
దీపిక పోస్ట్.. ‘కల్కి’ని ఉద్దేశించేనా?

‘కల్కి’ నుంచి తప్పుకున్నాక నటి దీపికా పదుకొణే ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 18 ఏళ్ల క్రితం ‘ఓంశాంతి ఓం’ సినిమా చేసినప్పుడు షారుఖ్ తనకు ఓ పాఠం చెప్పారని గుర్తుచేసుకున్నారు. ‘ఒక సినిమా విజయంతో పోలిస్తే అది అందించే అనుభవం, దాని కారకులే మరింత ముఖ్యమన్న ఆయన సలహాను నా ప్రతి నిర్ణయానికీ అమలు చేస్తున్నా. అందుకే మేమిద్దరం ఆరోసారి కలిసి నటిస్తున్నామేమో’ అని రాసుకొచ్చారు.
Similar News
News September 20, 2025
తిరుమలను వాడుకోవడం CBN, లోకేశ్‌కు అలవాటు: YCP

AP: రాజకీయాల కోసం తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం CBN, <<17773731>>లోకేశ్<<>>కు అలవాటుగా మారిందని YCP మండిపడింది. ‘పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్‌ను పట్టుకున్నది 2023, APLలో. అంటే YCP హయాంలో. పోలీసులు విచారించడంతో అతని కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెంది రూ.14.43కోట్ల ఆస్తులను TTDకి గిఫ్టురూపంలో ఇచ్చేశారు. ఇది చట్టప్రకారం, కోర్టుల న్యాయసూత్రాల ప్రకారం జరిగింది’ అని ట్వీట్ చేసింది.
News September 20, 2025
H1B వీసా నిబంధనపై స్పందించిన భారత్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన H1B వీసా నిబంధనపై భారత్ తొలిసారి అధికారికంగా స్పందించింది. తాజా పరిణామాలను పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ఇది ఇరుదేశాల్లోని సంస్థలను ప్రభావితం చేస్తుందన్నారు. ఎన్నో కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెడుతుందని స్పష్టం చేశారు. H1B నిబంధనలతో తలెత్తే ఇబ్బందులను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశిస్తున్నట్లు జైస్వాల్ చెప్పారు.
News September 20, 2025
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. APPLY

AP: SC, ST, BC, OC నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అంబేడ్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. IBPS, RRB, SSC వంటి పోటీ పరీక్షల కోసం తిరుపతి, విశాఖ కేంద్రాల్లో శిక్షణ ఇస్తామని, ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 24 నుంచి OCT 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9949686306 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.