News September 20, 2025
విశాఖలో ఈ గవర్నెన్స్ సదస్సుపై సమీక్ష

విశాఖలో ఈ నెల 22,23న జరిగే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సుపై ఐటి విభాగం కార్యదర్శి కాటమనేని భాస్కర్ శనివారం సమీక్షించారు. రెండు రోజుల సదస్సుకు వెయ్యి మంది ప్రతినిధులు వస్తారన్నారు. కొందరు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉందన్నారు. దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. సదస్సు జరగనున్న హోటల్ వద్ద వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు.
Similar News
News September 20, 2025
విశాఖ కలెక్టరేట్లో ఉచిత వైద్య శిబిరం

విశాఖ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని ఆయన చేతుల మీదుగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 147 మంది సిబ్బంది ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
News September 20, 2025
విశాఖ: 3రోజుల్లో 1,759 ఆక్రమణల తొలగింపు

విశాఖ ఆపరేషన్ లంగ్స్ 2.0 కింద 3 రోజుల్లో 1,759 ఆక్రమణలు తొలగించినట్లు సిటీ చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకరరావు ప్రకటించారు. తగరపువలస, భీమిలి-51, శ్రీకాంత్‌నగర్, అంబేద్కర్ జంక్షన్-70, గురుద్వారా, పోర్ట్ స్టేడియం-60, అంబేద్కర్ సర్కిల్, జైలు రోడ్డు-195, ఊర్వశి జంక్షన్-35, గాజువాక, వడ్లపూడి-204, నెహ్రూచౌక్-26, వేపగుంట, గోశాల జంక్షన్, సింహాచలం ద్వారం పరిధిలో 65 ఆక్రమణలు తొలగించారు.
News September 20, 2025
చిరువ్యాపారుల పొట్ట కొడుతున్నారు: కేకే రాజు

నగరంలో చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారని వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. శనివారం సీతమ్మధార ప్రాంతంలో బడ్డీల తొలగింపు ప్రక్రియను ఆయన వ్యాపారులతో కలిసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇటువంటి చర్యలకు ఎప్పుడూ పాల్పడలేదని అన్నారు.