News September 20, 2025
గద్వాల: కూతురిని పండగకు పిలిచేందుకు వెళ్లి.. తండ్రి మృత్యువాత

కూతురుని పండగకి పిలిచేందుకు వెళ్లిన వ్యక్తి రైలు ఢీకొని మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రాజోలి వాసి మల్లయ్య(55) తన చిన్నకూతురుని పెద్దల అమావాస్య పండగకు తీసుకురావడానికి ఉందానగర్‌కి వెళ్లాడు. అక్కడి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా కాలు జారి కిందపడ్డాడు. అదే సమయంలో వచ్చిన ఓ రైలు ఆయనను ఢీకొనటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 20, 2025
నెల్లూరు: ఈనెల 22 నుంచి దసరా సెలవులు: DEO

ఈనెల 22 నుంచి 11 రోజులపాటు జిల్లాలోని అన్ని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి విద్యార్థులకు సెలవులు ప్రకటించాలని సూచించారు. సెలవు రోజుల్లో ఎవరైనా తరగతులు నిర్వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
News September 20, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* రూ.25.30 కోట్ల విలువజేసే 1858 కిలోల డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలను ధ్వంసం చేసిన సైబరాబాద్ పోలీసులు
* రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ ఆసుపత్రులలో లేదా అనుబంధంగా ఉన్న 115 ఫార్మసీల్లో అవకతవకలపై షోకాజ్ నోటీసులు జారీ చేసిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు.
* ఈ నెలలో అదనంగా 1.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం ఆమోదం.
* ఈ నెల 23న మేడారానికి సీఎం రేవంత్
News September 20, 2025
విశాఖ కలెక్టరేట్లో ఉచిత వైద్య శిబిరం

విశాఖ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని ఆయన చేతుల మీదుగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 147 మంది సిబ్బంది ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.