News September 20, 2025

వృద్దురాలిపై దాడి.. బంగారం అపహరణ

image

మొగల్తూరు మండలం కాళీపట్నంలో ఒంటరిగా ఉంటున్న బళ్ల సూర్య ఆదిలక్ష్మి రాజేశ్వరి (55)పై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. శనివారం జరిగిన ఈ ఘటనలో దుండగుడు ఆమె తలపై కర్రతో కొట్టగా స్పృహ కోల్పోయింది. తర్వాత గొలుసు తెంపుకొని పారిపోయాడు. రాజేశ్వరి నరసాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 20, 2025

ఈనెల 24న పాలకొల్లు రానున్న సీఎం చంద్రబాబు

image

ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో, పాలకొల్లులో సిద్ధం చేస్తున్న హెలిపాడ్, కళ్యాణ వేదిక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి శనివారం పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నందున, బ్రాడీపేట బైపాస్ రోడ్డులో హెలిపాడ్‌ను పరిశీలించి, పనులు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

News September 20, 2025

పాలకొల్లులో: మొక్కలు నాటిన కలెక్టర్ నాగరాణి

image

స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాలకొల్లులోని ఆదిత్య కాలనీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మొక్కలు నాటారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

News September 20, 2025

పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

image

పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ ఏకైక కుమారుడు డా.అంజన్(55) గుండె పోటుతో శనివారం ఉదయం మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇవాళ ఉదయం ఆయనకు ఇంటి వద్ద గుండె పోటు రాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అంజన్ మృతదేహాన్ని ఆయన ఇంటికి తరలించారు. నాయకులు, ప్రజలు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు.