News September 20, 2025
రేపు పాక్‌తో మ్యాచ్.. సూర్య ఏమన్నారంటే?

ఆసియా కప్: రేపు PAKతో జరిగే మ్యాచ్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించట్లేదని IND కెప్టెన్ సూర్య తెలిపారు. ‘ప్రతీ మ్యాచ్ ఒక కొత్త ఛాలెంజ్. రేపు సండే కావడంతో చాలా మంది చూస్తారు. గ్రౌండ్‌లోకి దిగి వారిని ఎంటర్టైన్ చేయాలి. సేమ్ ఇంటెన్సిటీ, ఎనర్జీతో ఆడతాం. బెస్ట్ ఇస్తాం’ అని అన్నారు. ఇతరులకు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చేందుకే ఒమన్‌తో మ్యాచులో తాను బ్యాటింగ్ చేయలేదన్నారు. తనకు టీమ్ గెలిస్తే చాలని చెప్పారు.
Similar News
News September 20, 2025
భారత్‌తో మ్యాచ్.. పాక్ డ్రామా షురూ!

ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య రేపు సూపర్-4 మ్యాచ్ జరగనుంది. దీంతో ఇవాళ జరగాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను పాక్ బాయ్‌కాట్ చేసింది. తొలి మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని PCB అలకబూనిన విషయం తెలిసిందే. UAEతో మ్యాచ్ ఆడబోమంటూ పెద్ద <<17741773>>డ్రామానే<<>> చేసింది. చివరికి తోక ముడిచి మ్యాచ్ ఆడింది. రేపటి మ్యాచ్ నేపథ్యంలో మళ్లీ కొత్త నాటకానికి తెరలేపింది. దీంతో ఇరుదేశాల మధ్య ఆట ఉత్కంఠగా మారింది.
News September 20, 2025
RRB పరీక్ష తేదీ ఖరారు

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) వివిధ జోన్లలో మొత్తం 11,558 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. OCT 13న CBT-2 పరీక్ష నిర్వహించనున్నట్లు RRB ప్రకటించింది. పరీక్షకు 4 రోజుల ముందు <
News September 20, 2025
ఒకే ఏడాదిలో 34 సినిమాలు@ మోహన్‌లాల్

నటుడు <<17774717>>మోహన్ లాల్<<>>కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన 1978లో ‘తిరనోట్టం’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. 1986లో ఏకంగా 34 సినిమాల్లో నటించారు. నిర్మాత, గాయకుడిగానూ గుర్తింపు పొందారు. 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ అవార్డులు ఆయన్ను వరించాయి. 2 సార్లు జాతీయ, 9 సార్లు కేరళ ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు. 9 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సైతం ఆయన నటనకు దాసోహమయ్యాయి.