News September 20, 2025
డ్రోన్లతో వ్యవసాయం లాభసాటి మార్గం: కలెక్టర్

లింగపాలెంలో వరి పొలాల్లో డ్రోన్లతో నానో యూరియా స్ప్రే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి శనివారం పరిశీలించారు. రైతులకు సబ్సిడీతో అధునాతన వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. డ్రోన్లతో ఎరువులు, పురుగు మందులు 5 నిమిషాల్లోనే పిచికారీ అవ్వడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News September 20, 2025
శ్రీశైలంలో 22 నుంచి నిత్య అలంకరణలు ఇవే..!

దసరా నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని శ్రీశైలంలో జరిగే నిత్య అలంకార సేవలు ఇవే..
☞ ఈనెల 22న శైలపుత్రీ దుర్గ ☞ 23న బ్రహ్మచారిణి దుర్గ
☞ 24న చంద్ర ఘంట దుర్గ ☞ 25న కూష్మాండ దుర్గ
☞ 26న స్కంద మాత దుర్గ ☞ 27న కాత్యాయని దుర్గ
☞ 28న కాళరాత్రి దుర్గ ☞ 29న మహాగౌరి దుర్గ
☞ 30న సిద్ధిదాయిని దుర్గ ☞ 01న రాజరాజేశ్వరి
☞ 02న శ్రీ భ్రమరాంబిక దేవి
News September 20, 2025
RRB పరీక్ష తేదీ ఖరారు

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) వివిధ జోన్లలో మొత్తం 11,558 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. OCT 13న CBT-2 పరీక్ష నిర్వహించనున్నట్లు RRB ప్రకటించింది. పరీక్షకు 4 రోజుల ముందు <
News September 20, 2025
గుంటూరు: పీజీ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై నెలలో జరిగిన పీజీ సెకండ్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను అధికారులు శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఎమ్మెస్సీ బోటనీ, కంప్యూషనల్ డేటా సైన్స్, ఎంఏ హిస్టరీ, ఆర్కియాలజీ, మహాయాన బుద్ధిస్ట్, ఎంబీఏ మీడియా మేనేజ్‌మెంట్ కోర్సుల ఫలితాలు విడుదలయ్యాయి. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ https://kru.ac.in/ సందర్శించాలని అధికారులు సూచించారు.