News September 20, 2025
BREAKING: HYD: విషాదం.. ఇద్దరు యువకులు మృతి

HYD బొల్లారంలో ఈరోజు విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ వద్ద ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది. పట్టాలు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు కార్ఖానా, మచ్చ బొల్లారం వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Similar News
News September 20, 2025
HYD: MBA, MCA సీట్లు వేలకొద్దీ మిగిలాయి..!

కౌన్సెలింగ్ అనంతరం రాష్ట్రంలో MBA, MCA సీట్లు వేలకొద్దీ మిగిలాయి. ఐసెట్ తుది దశ కౌన్సిలింగ్ ముగిసే సరికి MBAలో 4,456 సీట్లు, MCAలో 2,504 సీట్లు మిగిలాయి. ఇదిలా ఉండగా సీట్లు పొందిన విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈనెల 23వ తేదీలోపు ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన HYDలో తెలిపారు.
News September 20, 2025
HYD: మెట్రో రైల్ VS సర్కార్

మెట్రో రైల్ నిర్వహణ.. ఇపుడు నగరంలో హాట్ టాపిక్. మెట్రోకు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది.. ఇవ్వకపోతే ఎలా నడపాలని నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ చెబుతోంది. మీరే తీసుకోండి అని ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే మేమెందుకు తీసుకుంటాం? అని డైరెక్టుగా ముఖ్యమంత్రే ఢిల్లీలో ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న ప్రాజెక్టును నడపడం సాధ్యం కాదు అని పేర్కొన్నారు.
News September 20, 2025
HYD: నిమ్స్ హాస్పిటల్.. రోబోటిక్ సర్జరీ స్పెషల్..!

HYD నగరంలోని ప్రతిష్ఠాత్మక నిమ్స్ ఆస్పత్రి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలందిస్తూ మన్ననలందుకుంటోంది. నిమ్స్ వైద్యులు 650 రోబోటిక్ సర్జరీలు చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. యూరాలజీకి సంబంధించి సర్జరీలే 370 ఉన్నాయి. ఇటువంటి చికిత్స కోసం నిమ్స్‌లో 20 మంది వైద్యులు ప్రత్యేకంగా శిక్షణ పొందారు.