News September 20, 2025

ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణకే సొంతం: ఎంపీ కావ్య

image

హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఎంపీ కడియం కావ్య హాజరై విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు. కులం, మతం, బీద, గొప్ప అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క మహిళ కలిసి మెలిసి ఆడుకుంటారని తెలిపారు. ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణకు సొంతమన్నారు.

Similar News

News September 20, 2025

బాపట్ల జిల్లాకు భారీ వర్ష సూచన

image

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ శనివారం తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్లకింద నిలబడరాదని సూచించారు.

News September 20, 2025

HYD: అసలు మెట్రో మ్యాన్‌ను ఎందుకు తప్పించినట్టు?

image

మెట్రో పనులు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 18 సంవత్సరాలు.. హైదరాబాద్ మెట్రో అంటే ఆయన పేరే గుర్తుకు వస్తుంది. మెట్రో మ్యాన్ అనే పేరు కూడా సంపాదించుకున్నారు. ఆయనే ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో ఎండీగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన ఆయన్ను రేవంత్ రెడ్డి ఎందుకు తప్పించారు అనేది ఇపుడు సిటీలో చర్చనీయాంశంగా మారింది. అసలే సందిగ్ధంలో ఉన్న మెట్రో నిర్వహణపై ఎండీ మార్పు ప్రభావం పడుతుందనేది నిర్వివాదాంశం.

News September 20, 2025

సూర్యాపేట: పోలీసులకు ‘మెరిటోరియస్ సర్వీస్ రివార్డ్స్’ పంపిణీ

image

ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు ఎస్పీ కె.నర్సింహ మెరిటోరియస్ సర్వీస్ రివార్డ్స్‌ను అందజేశారు. స్థానిక పోలీసు కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దొంగతనం కేసులో చాకచక్యంగా వ్యవహరించి బంగారం రికవరీ చేసిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్యలకు ఉత్తమ రివార్డులను అందజేశారు.