News September 20, 2025
RITESలో 27 పోస్టులు

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ సర్వీస్(<
Similar News
News September 20, 2025
Dy.CM పవన్‌కు ధన్యవాదాలు: బోండా ఉమ

AP: అసెంబ్లీలో <<17761609>>ప్రస్తావించిన సమస్య<<>>ను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం. ఇలాంటి నాయకత్వం వల్లే ప్రజల్లో మీపై మరింత గౌరవం, విశ్వాసం పెరుగుతున్నాయి’ అని బోండా ట్వీట్ చేశారు.
News September 20, 2025
CAG: రాష్ట్రాల అప్పులు.. రూ.59.6 లక్షల కోట్లు

దేశంలోని 28 రాష్ట్రాల అప్పులు పదేళ్లలో మూడింతలు పెరిగాయి. 2013-14లో రూ.17.57 లక్షల కోట్లు ఉండగా 2022-23 వరకు రూ.59.6 లక్షల కోట్లకు చేరాయి. ఈ మేరకు స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్‌లో కంట్రోలర్&ఆడిటర్ జనరల్(CAG) సంజయ్ వెల్లడించారు. అప్పు, GSDP రేషియో పరంగా పంజాబ్(40.35%), నాగాలాండ్(37.15%), బెంగాల్(33.7%) టాప్‌లో ఉన్నాయి. ఒడిశా(8.45%), MH(14.64%), GT(16.37%) తక్కువ రేషియో నమోదు చేశాయి.
News September 20, 2025
భారత్‌తో మ్యాచ్.. పాక్ డ్రామా షురూ!

ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య రేపు సూపర్-4 మ్యాచ్ జరగనుంది. దీంతో ఇవాళ జరగాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను పాక్ బాయ్‌కాట్ చేసింది. తొలి మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని PCB అలకబూనిన విషయం తెలిసిందే. UAEతో మ్యాచ్ ఆడబోమంటూ పెద్ద <<17741773>>డ్రామానే<<>> చేసింది. చివరికి తోక ముడిచి మ్యాచ్ ఆడింది. రేపటి మ్యాచ్ నేపథ్యంలో మళ్లీ కొత్త నాటకానికి తెరలేపింది. దీంతో ఇరుదేశాల మధ్య ఆట ఉత్కంఠగా మారింది.