News September 20, 2025
HYD: కేబీఆర్ పార్కులో రేపు కుక్క పిల్లలను ఇస్తారు..!

రేపు KBR పార్కులో దేశీ పప్పీ డాగ్ అడాప్షన్ మేళా జరగనున్న నేపథ్యంలో GHMC అధికారులు కుక్క పిల్లల ప్రేమికులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పార్కు వద్దకు వచ్చి దత్తత తీసుకునే అవకాశం ఉందన్నారు. అభిమానులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News September 20, 2025
హైదరాబాద్ మెట్రో నిర్వహణపై నీలి నీడలు?

హైదరాబాద్ మెట్రో ఏర్పాటుకు రూ.వేల కోట్లు వెచ్చించారు. లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇపుడు మెట్రో నిర్వహణే సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడంతో నడపడం కష్టమని ఎల్ అండ్ టీ చెబుతోంది. అయితే డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం మాటమాత్రంగా కూడా చెప్పడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మెట్రో రైలు అసలు తిరుగుతుందా అనే అనుమానాలు నగర వాసికి వస్తున్నాయి.

HYD: పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్‌కు వినతి

పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్‌ను పంచాయితీ కార్యదర్శులు శనివారం HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. 317 జీవోతో పంచాయతీ కార్యదర్శులకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. 317 జీవోతో నష్టపోయిన పంచాయితీ కార్యదర్శులకు 190 జీవో ప్రకారం తాత్కాలిక డిప్యూటేషన్లు, కల్పించాలని కోరారు. దేనికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.