News April 5, 2024
ఏడుపాయలలో నీట మునిగి వ్యక్తి మృతి

ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన భక్తుడు నీట మునిగి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాపన్నపేట ఎస్ఐ నరేశ్ వివరాల ప్రకారం.. HYD సంజీవరెడ్డి నగర్‌కు చెందిన వెంకటేశ్(28) బంధువులతో కలసి ఏడుపాయలకు వచ్చాడు. స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మంజీర పాయల్లో మునిగి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Similar News
News October 26, 2025
చిన్నశంకరంపేట: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గవలపల్లి ఎక్స్ రోడ్డులోని వైన్స్ పర్మిట్ రూమ్ ఎదురుగా అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అంబాజీపేట గ్రామానికి చెందిన బండారు వెంకటేశం(40)గా గుర్తించారు. ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
News October 26, 2025
మెదక్: ‘పది రోజుల్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి’

రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్‌పై కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం సమీక్షించారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ఆయన తహశీల్దార్లు, ఆర్డీఓలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. 10 రోజుల తర్వాత దరఖాస్తులను తప్పకుండా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.
News October 26, 2025
రామాయంపేట: GREAT.. 56వ సారి రక్తదానం

రామాయంపేట పట్టణానికి చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సొసైటీ ఛైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి 56వ సారి రక్తదానం చేశారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 56వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు చేతుల మీదుగా రక్తదాన పత్రాన్ని అందుకున్నారు. రాజశేఖర్ రెడ్డి సేవలను ఎస్పీ అభినందించారు.


