News September 20, 2025

వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎం&హెచ్ఓ

image

కలరా వంటి జలమూల వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.జీవనరాణి శనివారం సూచించారు. విరేచనాలు, వాంతులు, శరీర నిస్సత్తువ, డీహైడ్రేషన్ లాంటి లక్షణాలు గమనించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కలుషిత నీరు, కలుషిత ఆహారం వల్లే ఈ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయని, కాబట్టి మరిగించిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు.

Similar News

News September 20, 2025

VZM: ‘గంజాయిపై ఉక్కుపాదం మోపాం’

image

అందరి సహకారం, సమన్వయంతో జిల్లాను రాష్ట్రంలో అన్ని విభాగాల్లోను అగ్రగామిగా నిలిపామని విజయనగరం పూర్వ ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. స్థానిక పోలీస్ పరేడ్‌లో శనివారం వీడ్కోలు కార్యక్రమం జరిగింది. గంజాయి మూలాలను సమూలంగా నాశనం చేశామని, గంజాయి అక్రమ రవాణకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి, వారి ఆస్తులను కూడా అటాచ్ చేశామన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయడం వలనే ఇది సాధ్యమైందన్నారు.

News September 20, 2025

విజయనగరంలో ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. విజయనగరం పట్టణంలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పచ్చ జెండా ఊపి స్వచ్ఛాంధ్ర ర్యాలీను ప్రాంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

News September 20, 2025

VZM: స్త్రీశక్తి పథకానికి విశేష స్పందన

image

విజయనగరం జిల్లాలో స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన నెల రోజుల్లో 13,35,656 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. మహిళా ప్రయాణికుల సంఖ్య 65% పెరిగిందని, 4 రకాల బస్సుల్లో మొత్తం జీరో టిక్కెట్ రూ.4,85,01,735 అయినట్లు చెప్పారు. మహిళా ప్రయాణికులు క్రమంగా పెరుగుతుండగా పురుషుల సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు.