News September 20, 2025
ఐఫోన్-17 నాణ్యతపై విమర్శలు!

యాపిల్ నుంచి ఐఫోన్-17 సిరీస్ అమ్మకాలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. అయితే, గత సిరీస్‌లతో పోల్చితే 17 మోడల్స్‌లో నాణ్యత లేని అల్యూమినియం ఫ్రేమ్ వాడారని విమర్శలొస్తున్నాయి. దీనివల్ల ఫోన్‌పై గీతలు పడటం, దెబ్బ తినడం లాంటివి జరుగుతున్నాయని టెక్ నిపుణులు ఆరోపిస్తున్నారు. అయితే ఐఫోన్ -17 ఫ్రేమ్‌కు అత్యంత దృఢంగా ఉండే ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం వాడుతున్నామని యాపిల్ సంస్థ చెబుతోంది.
Similar News
News September 20, 2025
H-1B వీసా ఫీజు పెంపు.. వీరికి మినహాయింపు

H-1B వీసా ఫీజును <<17767574>>భారీగా<<>> పెంచిన US కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ప్రస్తుతం H-1B వీసా కలిగి ఉన్నవారు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కానీ 12 నెలలు లేదా అంతకుమించి ఇతర దేశాల్లో ఉంటున్నవారు రేపటిలోగా తిరిగి USకి వెళ్లాలి. గడువు దాటితే ఫీజు కట్టి వెళ్లాల్సిందే. మరోవైపు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అనుమతించిన వారికి, హెల్త్‌కేర్, మిలిటరీ, ఇంజినీరింగ్ తదితర కీలక రంగాల ఉద్యోగులకు మినహాయింపు ఉండనుంది.
News September 20, 2025
24 లేదా 25 తేదీల్లో మెగా DSC నియామక పత్రాల ప్రదానం

AP: రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 24 లేదా 25వ తేదీన నియామక పత్రాలు అందించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 19న నియామక ఉత్తర్వుల అందజేతకు నిర్ణయించినా వర్షాల కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా అధికారిక షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
News September 20, 2025
రేపు OG ప్రీ రిలీజ్ ఈవెంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంకా మోహన్ కాంబోలో సుజీత్ తెరకెక్కించిన OG మూవీ ఈనెల 25న థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని LB స్టేడియంలో రేపు 4PM నుంచి 10.30 PM వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ సమయంలో రవీంద్ర భారతి, ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్‌బాగ్, BJR స్టాట్యూ సర్కిల్, పబ్లిక్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.