News September 20, 2025

HYD: ఇక్రిశాట్ టోల్‌గేట్ దగ్గర భారీగా గంజాయి పట్టివేత

image

గంజాయి అక్రమ రవాణాలో స్మగ్లర్లు తెలివి మీరిపోయారు. ఒడిశా నుంచి ముంబైకి 170 కేజీల ఎండు గంజాయిని రవాణా చేస్తోన్న ఇద్దరిని HYD పటాన్‌చెరు పరిధి ఇక్రిశాట్ టోల్‌గేట్ వద్ద మాదాపూర్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు దొరకొద్దని 80 ప్యాకెట్లలో గంజాయిని నింపి, హోండా సిటీ కారులో దాచినట్లు గుర్తించారు. గంజాయితోపాటు MH02 BP 4385 నంబర్ గల కారుని సీజ్ చేశామని పోలీస్ అధికారులు తెలిపారు.

Similar News

News September 20, 2025

HYD: రేపు తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు

image

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని BRS పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రేపు (ఆదివారం) మధ్యాహ్నం HYD బంజరాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు మహిళా నాయకురాలు సుశీల రెడ్డి ఈరోజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ జడ్పీ ఛైర్మన్లు, వివిధ జిల్లాల మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొంటారని పేర్కొన్నారు.

NZB: అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,01,116 విరాళం

image

ఎస్‌జీఎస్ పద్మావతి నిత్య అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,01,116 PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విరాళం ప్రకటించారు. శనివారం గంగస్థాన్ ఫేజ్-2లోని ఉత్తర తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్నదానం కన్నా గొప్ప దానం మరొకటి లేదన్నారు. దేవుడిని నమ్మే వ్యక్తుల్లో తాను మొదటివాడినని, దేవుని ఆశీస్సులతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు.