News September 20, 2025
HYD: ఇక్రిశాట్ టోల్‌గేట్ దగ్గర భారీగా గంజాయి పట్టివేత

గంజాయి అక్రమ రవాణాలో స్మగ్లర్లు తెలివి మీరిపోయారు. ఒడిశా నుంచి ముంబైకి 170 కేజీల ఎండు గంజాయిని రవాణా చేస్తోన్న ఇద్దరిని HYD పటాన్‌చెరు పరిధి ఇక్రిశాట్ టోల్‌గేట్ వద్ద మాదాపూర్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు దొరకొద్దని 80 ప్యాకెట్లలో గంజాయిని నింపి, హోండా సిటీ కారులో దాచినట్లు గుర్తించారు. గంజాయితోపాటు MH02 BP 4385 నంబర్ గల కారుని సీజ్ చేశామని పోలీస్ అధికారులు తెలిపారు.
Similar News
News September 20, 2025
HYD: బతుకమ్మను జాతీయ పండుగగా గుర్తించాలి: జాజుల

బతుకమ్మను జాతీయ పండుగగా గుర్తించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈనెల 24న ట్యాంక్‌బండ్ బతుకమ్మ ఘాట్ వద్ద నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో పోస్టర్‌ను సంఘం రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గనుల స్రవంతి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
News September 20, 2025
HYD: రేపు తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని BRS పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రేపు (ఆదివారం) మధ్యాహ్నం HYD బంజరాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు మహిళా నాయకురాలు సుశీల రెడ్డి ఈరోజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ జడ్పీ ఛైర్మన్లు, వివిధ జిల్లాల మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొంటారని పేర్కొన్నారు.
News September 20, 2025
HYD: తెలంగాణ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు.. గుజరాతీపై కేసు నమోదు

తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన గుజరాతీ ప్రగతి సమాజ్ ప్రతినిధి జిఘ్నేశ్ దోషిపై HYD సుల్తాన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ టీవీ ఛానల్‌లో జిఘ్నేశ్ దోషి తెలంగాణ ప్రజల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడని తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు సతీశ్ గౌడ్ ఆగస్టు 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. లీగల్ అడ్వైజ్ తీసుకున్న అనంతరం శనివారం జిఘ్నేశ్ దోషిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.