News September 20, 2025
పల్నాడు ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తాం: సీఎం

పల్నాడు ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. మాచర్లలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పల్నాడుకు ఎంతో చరిత్ర ఉందన్నారు. పల్నాడు చరిత్ర భావితరాలకు తెలియవలసిన అవసరం ఉందన్నారు. పల్నాడు ఉత్సవాలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.
Similar News
News September 20, 2025
అక్టోబర్ నాటికి భూసేకరణ పూర్తి చేస్తాం: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం: జాతీయ రహదారులకు భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణా రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్‌హెచ్ 163జీ, రింగ్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ హైవే, ఎన్‌హెచ్65 వంటి ప్రాజెక్టుల భూసేకరణలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. అక్టోబర్ చివరి నాటికి ఖమ్మం జిల్లాలో 42 హెక్టార్ల భూసేకరణ పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
News September 20, 2025
మెదక్: మంత్రిని కలిసిన ఆరోగ్యశ్రీ ఆస్పత్రి ప్రతినిధులు

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని, ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని హాస్పిటల్స్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. వారు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
News September 20, 2025
ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సుభాశ్

రామచంద్రపురంలో కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ పాఠశాలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. 9,10 తర్వాత విద్యార్థులకు మంత్రి కౌన్సెలింగ్ నిర్వహించారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, వాటి బారిన పడితే భవిష్యత్తు అంధకారమేనని విద్యార్థులకు హితవు పలికారు. తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయొద్దని, మంచి భవిష్యత్తు పొందేలా శ్రద్ధగా చదవాలని సూచించారు.