News September 20, 2025

రాజమహేంద్రవరం-తిరుపతి మధ్య విమాన సర్వీసులు

image

AP: రాజమహేంద్రవరం-తిరుపతి మధ్య OCT 1 నుంచి విమాన సర్వీసు ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు. తొలి సర్వీసు ఆ రోజు ఉ.9:25గంటలకు తిరుపతి నుంచి రాజమహేంద్రవరం వచ్చి, ఉ.10:15గంటలకు తిరిగి వెళ్తుంది. OCT 2 నుంచి వారానికి 3 రోజులు(మంగళ, గురు, శని) ఈ విమాన సర్వీసులు నడుస్తాయి. ప్రతి రోజూ తిరుపతిలో ఉ.7:40గంటలకు బయల్దేరి రాజమహేంద్రవరానికి వస్తుంది. తిరిగి ఉ.9:50 గంటలకు బయల్దేరుతుంది.

Similar News

News September 20, 2025

17 మంది ఇంజినీర్లపై సీఎంకు ఏసీబీ నివేదిక

image

TG: TGSPDCL ఇంజినీర్ల అక్రమాలపై ACB ఫోకస్ పెట్టింది. ఇటీవల ADE <<17730161>>అంబేడ్కర్<<>> వద్ద రూ.వందల కోట్లు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా మరో 17 మంది ఇంజినీర్ల అవినీతిపై CM రేవంత్‌కు ACB నివేదిక ఇచ్చింది. HYDలోని ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, మేడ్చల్, రాజేంద్రనగర్, కందుకూరులో ADE, CE స్థాయుల్లో పనిచేసిన వీరు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని పేర్కొంది. బదిలీ విధానంలో ఇంజినీర్లకు ఆప్షన్లిచ్చి అడ్డగోలుగా పోస్టింగ్స్ ఇచ్చిన తీరును ప్రస్తావించింది.

News September 20, 2025

పాపం శంకర్.. తోడు లేక ప్రాణాలు విడిచింది

image

ఢిల్లీ జూలో 24ఏళ్లు ఒంటరి జీవితం గడిపిన ‘శంకర్’ అనే ఆఫ్రికన్ ఏనుగు ప్రాణాలు విడిచింది. ఈనెల 17న ఆహారం తీసుకోవడానికి నిరాకరించి, సాయంత్రానికి చనిపోయింది. 1998లో మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు జింబాబ్వే 2 ఆఫ్రికన్ ఏనుగులను బహుమతిగా ఇచ్చింది. వాటిలో ఒకటి 2001లో చనిపోయింది. అప్పటి నుంచి శంకర్ ఒంటరి జీవితాన్ని అనుభవించింది. 13 ఏళ్లు ఏకాంత నిర్బంధంలో గడిపింది. తోడు కోసం ఎదురుచూసి చూసి మరణించింది.

News September 20, 2025

H-1B వీసా ఫీజు పెంపు.. వీరికి మినహాయింపు

image

H-1B వీసా ఫీజును <<17767574>>భారీగా<<>> పెంచిన US కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ప్రస్తుతం H-1B వీసా కలిగి ఉన్నవారు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కానీ 12 నెలలు లేదా అంతకుమించి ఇతర దేశాల్లో ఉంటున్నవారు రేపటిలోగా తిరిగి USకి వెళ్లాలి. గడువు దాటితే ఫీజు కట్టి వెళ్లాల్సిందే. మరోవైపు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అనుమతించిన వారికి, హెల్త్‌కేర్, మిలిటరీ, ఇంజినీరింగ్ తదితర కీలక రంగాల ఉద్యోగులకు మినహాయింపు ఉండనుంది.