News April 5, 2024
ADB: ఎన్నికల విధుల్లో 10,489 మంది ఉద్యోగులు

ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో విధులు నిర్వహించాల్సిన ఎన్నికల ఉద్యోగులకు ఇప్పటికే తొలి విడత శిక్షణ పూర్తి కాగా వారంతా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోని 2,111 పోలింగ్ కేంద్రాలకు మొత్తం 10,489 మంది ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఇందులో 55 ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఎంపిక చేశారు. ఎన్నికల నిర్వహణలో వీరంతా భాగస్వాములు కానున్నారు.
Similar News
News April 22, 2025
ADB: పాపం.. 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేశారు..!

నేరడిగొండ మండలంలోని ఓ బాలిక(16)కు మహారాష్ట్రకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్, డీసీపీయూ, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది నేరడిగొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ మంజుల ఈ విషయంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.
News April 22, 2025
ADB: వడదెబ్బతో ఒకరి మృతి

వడ దెబ్బతో వ్యక్తి మృతిచెందిన ఘటన నార్నూరు మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. భీంపూర్ గ్రామానికి చెందిన చవాన్ కేశవ్(60) ప్రతి రోజు వెళ్లినట్లుగా సోమవారం ఉపాధిహామీ పనికి వెళ్లి పని పూర్తిచేసుకొని తిరిగి ఇంటికొచ్చాడు. దాహంగా ఉండడంతో మంచినీరు తాగి సేద తీరుతామని మంచంపై కాసేపు పడుకుంటామని విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఆయన అక్కడికే కుప్పకూలిపోయాడు. నష్టపరిహారం ఇవ్వాలని ప్రజలు కోరారు.
News April 22, 2025
భీంపూర్: రైతు బిడ్డకు బ్యాంక్ మేనేజర్ కొలువు

భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన అడెపు అశోక్, కళావతి వారికి ఉన్న 3 ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేస్తూ.. కూలి పనులు చేసుకుంటున్నారు. వారి కొడుకు శ్రీకాంత్ సోమవారం వెలువడిన బ్యాంక్ ఫలితాల్లో సత్తాచాటారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో ఆ పేద తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా గ్రామస్థులు శ్రీకాంత్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.