News September 20, 2025
HYD: అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో CP CV ఆనంద్

HYD CP CV ఆనంద్ అడిషనల్ మెజిస్ట్రేట్‌గా పనిచేశారు. తన కోర్టులో 11 రౌడీ గ్యాంగ్ కేసులు విన్నారు. వాటిలో 8 మందికి పీస్ బాండ్స్ ఎగ్జిక్యూట్ చేయించారు. పెద్దలు, స్నేహితులతో పరస్పర ప్రతీకారంతో కాకుండా, ఒకరిని మరొకరు హత్య చేయకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. పాతబస్తీ తదితర ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం పెంపొందించేందుకు ఈ బాండ్స్ ఉపయోగపడతాయని చెప్పారు.
Similar News
News September 20, 2025
17 మంది ఇంజినీర్లపై సీఎంకు ఏసీబీ నివేదిక

TG: TGSPDCL ఇంజినీర్ల అక్రమాలపై ACB ఫోకస్ పెట్టింది. ఇటీవల ADE <<17730161>>అంబేడ్కర్<<>> వద్ద రూ.వందల కోట్లు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా మరో 17 మంది ఇంజినీర్ల అవినీతిపై CM రేవంత్‌కు ACB నివేదిక ఇచ్చింది. HYDలోని ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, మేడ్చల్, రాజేంద్రనగర్, కందుకూరులో ADE, CE స్థాయుల్లో పనిచేసిన వీరు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని పేర్కొంది. బదిలీ విధానంలో ఇంజినీర్లకు ఆప్షన్లిచ్చి అడ్డగోలుగా పోస్టింగ్స్ ఇచ్చిన తీరును ప్రస్తావించింది.
News September 20, 2025
యాదాద్రి: శ్రీ స్వామివారి సేవలో హైకోర్ట్ జడ్జి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని శనివారం హైకోర్టు జడ్జి కే.శరత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ప్రధానాలయంలోని ధ్వజస్తంభ దర్శనానంతరం స్వయంభు దర్శనం చేసుకొని గోత్రనామార్చిన పూజలు చేశారు. అర్చకులు స్వర్ణ పుష్పార్చన చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద ఆశీర్వచనం అందజేశారు.
News September 20, 2025
అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ విద్యార్థులను కొట్టిన ప్రిన్సిపల్.. డీఈఓ విచారణ
➤ నర్సీపట్నం రూరల్ పిఎస్‌ను తనిఖీ చేసిన విశాఖ రేంజ్ డీఐజీ
➤ జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర
➤ ఇంటి బాట పట్టిన హాస్టల్ విద్యార్థులు
➤ కాశీపురంలో పరిశుభ్రత పాటించని 8 షాపులకు జరిమానా
➤ పోలీస్ సంకల్పంలో భాగంగా విద్యార్థులకు అవగాహన
➤ టీచర్లకు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్‌లు
➤ రైవాడ సాగునీటి కాలువలు అభివృద్ధికి రూ.50 లక్షలు