News September 20, 2025
మహిళా ఈ-హాత్ స్కీమ్ గురించి తెలుసా?

కేంద్ర శిశు, మహిళాభివృద్ధి శాఖ మహిళా ఈ హాత్ పథకాన్ని పర్యవేక్షిస్తోంది. దీన్ని 2016లో ప్రారంభించారు. మహిళా ఈ-హాత్ ఒక ద్విభాషా మార్కెటింగ్ ప్లాట్ ఫామ్. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, లాభాపేక్ష లేని సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిలో 18 రకాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవచ్చు.
Similar News
News September 20, 2025
కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తా: పవన్

AP: కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తానని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘శంకరగుప్తం మేజర్ డ్రయిన్ వెంబడి ఉన్న గ్రామాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్న విషయం నా దృష్టికి వచ్చింది. కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం.. ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. దసరా తర్వాత అక్కడికి వెళ్లి రైతాంగాన్ని కలిసి, తోటలు పరిశీలిస్తా’ అని ట్వీట్ చేశారు.
News September 20, 2025
రేపటి నుంచే సెలవులు.. హైవేపై రద్దీ

తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 22 నుంచి దసరా సెలవులు మొదలవనుండగా ఆదివారం కలిసి రావడంతో రేపటి నుంచే హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. దీంతో HYD-విజయవాడ హైవే వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతోంది. HYD నుంచి ఆంధ్రాకు, ఆంధ్రా నుంచి HYDకు రాకపోకలు సాగించేవారితో టోల్‌ప్లాజాల వద్ద రద్దీ నెలకొంది. ఇక ఏపీలో వచ్చేనెల 3న, టీజీలో 4న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. అప్పటివరకు విద్యార్థులు సెలవులు ఎంజాయ్ చేయనున్నారు.
News September 20, 2025
17 మంది ఇంజినీర్లపై సీఎంకు ఏసీబీ నివేదిక

TG: TGSPDCL ఇంజినీర్ల అక్రమాలపై ACB ఫోకస్ పెట్టింది. ఇటీవల ADE <<17730161>>అంబేడ్కర్<<>> వద్ద రూ.వందల కోట్లు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా మరో 17 మంది ఇంజినీర్ల అవినీతిపై CM రేవంత్‌కు ACB నివేదిక ఇచ్చింది. HYDలోని ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, మేడ్చల్, రాజేంద్రనగర్, కందుకూరులో ADE, CE స్థాయుల్లో పనిచేసిన వీరు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని పేర్కొంది. బదిలీ విధానంలో ఇంజినీర్లకు ఆప్షన్లిచ్చి అడ్డగోలుగా పోస్టింగ్స్ ఇచ్చిన తీరును ప్రస్తావించింది.