News September 20, 2025
HYD: స్కిల్స్ నేర్చుకుంటేనే ఉపాధి: మాజీ మంత్రి

తెలంగాణ రాష్ట్ర ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ ఎక్స్‌పో కార్యక్రమంలో BRS సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాలను ప్రారంభించిన మాజీ మంత్రి అనంతరం మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో యువత స్కిల్స్ నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా తెలిపారు. తెలంగాణ యువత ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
Similar News
News September 20, 2025
HYD: బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క సందడి

బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శనివారం HYD నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల విద్యార్థులతో కలిసి ఆటపాటలతో మంత్రి సందడి చేశారు. మహిళా కోఆపరేటీవ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ శోభారాణి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రముఖర్జీ పాల్గొన్నారు.
News September 20, 2025
HYD: బతుకమ్మను జాతీయ పండుగగా గుర్తించాలి: జాజుల

బతుకమ్మను జాతీయ పండుగగా గుర్తించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈనెల 24న ట్యాంక్‌బండ్ బతుకమ్మ ఘాట్ వద్ద నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో పోస్టర్‌ను సంఘం రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గనుల స్రవంతి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
News September 20, 2025
HYD: రేపు తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని BRS పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రేపు (ఆదివారం) మధ్యాహ్నం HYD బంజరాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు మహిళా నాయకురాలు సుశీల రెడ్డి ఈరోజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ జడ్పీ ఛైర్మన్లు, వివిధ జిల్లాల మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొంటారని పేర్కొన్నారు.