News September 20, 2025

ఏడుపాయల ఉత్సవాలకు రావాలని కలెక్టర్‌కు ఆహ్వానం

image

పాపన్నపేట మండలం ఏడుపాయలలో కొలువైన శ్రీ వనదుర్గ భవాని మాత దేవస్థానంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని కలెక్టర్ రాహుల్ రాజ్‌ను ఏడుపాయల ఆలయ కార్యనిర్వహణధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ సిబ్బంది శ్రీనివాస్, ప్రధాన పూజారి శంకర్ శర్మ ఆహ్వానించారు. వేదపండితులు ఆశీర్వదించారు.

Similar News

News September 21, 2025

మెదక్: ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టండి: పీడీ

image

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పనులు మొదలుపెట్టాలని హౌసింగ్ పీడీ మాణిక్యం సూచించారు. జిల్లాలో 9,156 ఇళ్లు మంజూరు కాగా, 5,511 ఇళ్ల పనులు మొదలయ్యాయన్నారు. ఇందులో ఐదు పూర్తి కాగా బెస్మెంట్ లేవల్‌లో 2,408, లెంటల్ లేవల్‌లో 295, స్లాబ్ లేవల్‌లో 124 ఉన్నాయన్నారు. 2,832 ఇళ్లకు బిల్ జనరేట్ కాగా 2,500 మందికి బిల్లులు జమ అయ్యాయని వివరించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.

News September 21, 2025

మెదక్: ‘జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు’

image

జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.

News September 21, 2025

మెదక్: రక్షణ జాగ్రత్తలు అవసరం: ఎస్పీ

image

దసరా పండగ పురస్కరించుకొని ఊర్లకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ప్రజల భద్రత, ఆస్తి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బంగారు నగలు, నగదు, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో భద్రపరచడం మంచిదన్నారు. ఊర్లకు బయలుదేరే ముందు పక్కింటి, నమ్మదగిన వ్యక్తులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.