News September 20, 2025
HYD: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: భట్టి

రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు HYD యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మహిళలను ఆర్థిక, సామాజిక శక్తివంతీకరణ, వ్యాపార శిక్షణ ఇచ్చి, కోటీశ్వరులుగా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.
Similar News
News September 21, 2025
HYD: సైబరాబాద్‌లో భారీగా డ్రగ్స్ ధ్వంసం

మాదకద్రవ్యాల మాఫియాకు సైబరాబాద్ పోలీసులు గట్టి హెచ్చరికలు ఇచ్చారు. రూ.25.30 కోట్ల విలువైన 1,858 కిలోల మాదకద్రవ్యాలను ఈరోజు ధ్వంసం చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కమిషనరేట్ చేపట్టిన 7వ దశ చర్య ఇది అని పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి పర్యవేక్షణలో డీసీపీ ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో 316 కేసులకు సంబంధించిన ఈ డ్రగ్స్‌ను పర్యావరణ నిబంధనల ప్రకారం దహనం చేశారు.
News September 20, 2025
HYD: రాత్రుళ్లు వస్తున్నారు.. జర జాగ్రత్త..!

రాత్రుళ్లు ఇళ్లలో దొంగతనాల కేసుల్లో ముగ్గురు నిందితులను HYD హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 22.6 తులాల బంగారం, 6 తులాల వెండి, రూ.3 లక్షల నగదు, కారును వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్థుడు మాండ్ల శివ జైలులో పరిచయమైన వారితో కలిసి గ్రేటర్ HYD పరిధిలో మళ్లీ దొంగతనాలు చేస్తున్నాడు. బంజారా కాలనీ, RTC మజ్దూర్ నగర్, జయసూర్య నగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి చొరబడి చోరీ చేస్తున్నారు.
News September 20, 2025
HYD: కొత్త డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుపై హెల్త్ మినిస్టర్ సమీక్ష

వైద్య వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో కొత్త డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపై ఉన్నతాధికారులతో ఈరోజు HYDలోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్‌లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కిడ్నీ జబ్బులు, డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. 2009లో ఈ సేవలు ప్రారంభించినప్పుడు 1,230 మంది డయాలసిస్ పేషెంట్లున్నారన్నారు.