News April 5, 2024
కరీంనగర్ సందర్శనకు KCR ఎలా వస్తారు?: బండి సంజయ్

పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు నేడు కరీంనగర్‌కు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఏ ముఖం పెట్టుకుని పంట పొలాల సందర్శనకు వస్తున్నారో సమాధానం చెప్పాలని మండిపడ్డారు. కేసీఆర్‌కు నిజంగా రైతులపట్ల చిత్తుశుద్ధి ఉంటే రైతుల దుస్థితికి తానే కారణమని ఒప్పుకుని ముక్కు నేలకు రాసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి కరీంనగర్‌కు రావాలని గురువారం ఓ సమావేశంలో డిమాండ్ చేశారు.
Similar News
News January 21, 2026
KNR: ‘జాతీయ ఓటరు దినోత్సవం విజయవంతం చేయాలి’

ఈనెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకల గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బూత్ స్థాయి పోలింగ్ అధికారులు వృద్ధ ఓటర్లకు సన్మానం చేయాలని పేర్కొన్నారు.
News January 20, 2026
కరీంనగర్‌లో పలువురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ

మల్టీ జోన్-1 పరిధిలో పరిపాలనా కారణాలతో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ గుర్రం తిరుమల్‌ను టౌన్-III ఎస్‌హెచ్‌ఓగా, వీఆర్‌లో ఉన్న వి.పుల్లయ్యను మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. అలాగే డబ్ల్యూపీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎండీ రఫీక్ ఖాన్‌ను వీఆర్‌కు, ట్రాఫిక్-II ఇన్‌స్పెక్టర్ పార్స రమేష్‌ను మందమర్రి కి బదిలీ చేశారు.
News January 20, 2026
KNR: ఎన్నికల విధులకు 12 మంది నోడల్ అధికారులు

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ పమేలా సత్పతి 12 మంది నోడల్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికల శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మీడియా పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలను వీరికి అప్పగించారు.


