News September 20, 2025

BREAKING: HYD: నగరం నుంచి రౌడీ షీటర్ బహిష్కరణ..!

image

హైదరాబాద్‌లో రౌడీ షీటర్ మహమ్మద్ అసద్‌పై 11కు మించి క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హింసాత్మక స్వభావం, బెదిరింపులు, ప్రత్యర్థులపై హత్యాయత్నాలు చేసిన నేరస్థుడు అతడు. 2024లో అసద్ అనుచరులతో కలిసి ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుడిని హత్య చేశాడు. ఇటీవల మరో గ్యాంగ్‌పై దాడికి సిద్ధమవుతుండగా, తుపాకీ, బుల్లెట్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని ఏడాదిపాటు నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు CP CV ఆనంద్ తెలిపారు.

Similar News

News September 21, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ పాల్వంచ పెద్దమ్మ గుడిలో వైభవంగా రుద్రహోమం
✓ భద్రాద్రి: తల్లీ, కుమారుడు అదృశ్యం
✓ మణుగూరు: ఈవోతో భక్తుల వాగ్వాదం..!
✓ అశ్వారావుపేట సొసైటీ సీఈవో సస్పెన్షన్
✓ అశ్వారావుపేట పోలీసులపై దాడికి యత్నం.. వ్యక్తిపై కేసు
✓ సింగరేణి కార్మికులకు వాటా ఇవ్వాలని సీఎంకు కొత్తగూడెం ఎమ్మెల్యే వినతి
✓ మణుగూరు: డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన
✓ కొత్తగూడెం: గంజాయి విక్రయదారుల అరెస్ట్

News September 21, 2025

కృష్ణా: ఆ నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు..!

image

జిల్లాలోని ఓ నియోజకవర్గంలో 3 వ్యక్తులు ఎమ్మెల్యేలుగా పాలన నడుస్తోంది. JSP MLA, ఆయన కుమారుడు, అల్లుడు వేర్వేరుగా వ్యవహారాలు చూసుకుంటున్నారు. అల్లుడు వ్యాపారం, కొడకు కేడర్, MLA అధికారులను డీల్ చేస్తుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదవులు మాత్రం టీడీపీ నేతలకే దక్కుతున్నాయని జనసేన శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. టీడీపీ నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నేతలు వాపోతున్నట్లు సమాచారం.

News September 21, 2025

పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలి: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లాలో నిర్వహించబోయే పోషణ మాసోత్సవాలను విజయవంతంగా అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. శనివారం పోషణ మాసోత్సవాల నిర్వహణపై కలెక్టర్ ఛాంబర్‌లో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నెలరోజుల పాటు కొనసాగనున్న మాసోత్సవాలలో గ్రామస్థాయిలో గర్భిణీలు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించాలని అన్నారు.