News September 20, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* రూ.25.30 కోట్ల విలువజేసే 1858 కిలోల డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలను ధ్వంసం చేసిన సైబరాబాద్ పోలీసులు
* రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ ఆసుపత్రులలో లేదా అనుబంధంగా ఉన్న 115 ఫార్మసీల్లో అవకతవకలపై షోకాజ్ నోటీసులు జారీ చేసిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు.
* ఈ నెలలో అదనంగా 1.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం ఆమోదం.
* ఈ నెల 23న మేడారానికి సీఎం రేవంత్
Similar News
News September 21, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 21, 2025
ఈ నెల 23న మేడారానికి సీఎం రేవంత్

TG: ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి మేడారం వెళ్లనున్నారు. ఆలయ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో సందర్శించి సమ్మక్క-సారలమ్మ పూజారులను సంప్రదించనున్నారు. వారి ఆమోదంతో అభివృద్ధిపై డిజైన్లను సీఎం రిలీజ్ చేస్తారు. ఈ మేరకు మేడారం అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో ఆయన సమావేశమయ్యారు. <<17659055>>గద్దెలను<<>> యధాతథంగా ఉంచి సంప్రదాయాలను పాటిస్తూ, ఆలయ ప్రాంగణాన్ని మరింత విస్తరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
News September 21, 2025
కూటమి పార్టీలు మరో 15 ఏళ్లు కలిసే ఉంటాయి: మంత్రి మనోహర్

AP: కూటమి పార్టీలు మరో 15 ఏళ్లు కలిసే ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమానికే CM చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ప్రజాప్రయోజనాల కోసమే Dy.CM పవన్ కళ్యాణ్ నిలబడ్డారని వివరించారు. ఇటీవల అసెంబ్లీలో బోండా ఉమ, పవన్ <<17776165>>ఎపిసోడ్<<>> తర్వాత ఇరుపార్టీల బంధంపై పలు ప్రశ్నలు ఉత్పన్నం కాగా, పైవ్యాఖ్యలతో వాటికి మనోహర్ క్లారిటీ ఇచ్చినట్లైంది.