News April 5, 2024
గుంటూరు అమ్మాయి.. బెల్జియం అబ్బాయి ప్రేమ వివాహం

గుంటూరు అమ్మాయికి బెల్జియం అబ్బాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గుంటూరు శివారు లాల్ పురానికి చెందిన పుష్పలత హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ. ప్రాజెక్ట్ పనిపై బెల్జియం వెళ్లారు. అక్కడ ప్రాజెక్టులో పని చేస్తున్న బెల్జియంకు చెందిన క్రిష్ పోలేంటితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో గుంటూరులో ఘనంగా వివాహం చేసుకున్నారు.
Similar News
News January 4, 2026
GNT: త్రిపుర గవర్నర్‌కి ఘన స్వాగతం

గుంటూరు విచ్చేసిన త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డికి ఆదివారం ఘన స్వాగతం లభించింది. ఐటీసీ వెల్కమ్ హోటల్ వద్ద అదనపు ఎస్పీ హనుమంతు, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో ఆంధ్రసారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో గవర్నర్ పాల్గొంటారు.
News January 4, 2026
తెనాలి: షార్ట్ ఫిల్మ్ పోటీలకు భారీ స్పందన

తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 11న నిర్వహించనున్న మా-ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అపూర్వ స్పందన లభించిందని దర్శకుడు దిలీప్ రాజ తెలిపారు. ఆదివారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి 203 లఘు చిత్రాలు పోటీకి వచ్చాయన్నారు. యువతలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ వేదికను సిద్ధం చేశామన్నారు. ప్రతిభ కనబరిచిన విజేతలకు సినీ, కళారంగ ప్రముఖుల జ్ఞాపకార్థం నగదు బహుమతులు అందజేస్తామన్నారు.
News January 4, 2026
అమరావతి ఎఫెక్ట్.. VJA-GNTలో రియల్ బూమ్

రాజధాని అమరావతి పనులు వేగవంతం కావడంతో విజయవాడ-గుంటూరు మధ్య రియల్ ఎస్టేట్ మళ్లీ కళకళలాడుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్మాణ రంగానికి ఊపిరి వచ్చింది. కేవలం వారం రోజుల్లోనే ఈ కారిడార్‌లో 20కి పైగా కొత్త అపార్ట్‌మెంట్లకు భూమిపూజ జరిగింది. కాజ, మంగళగిరి, పెదకాకాని ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులకు పోటీ పడుతున్నారు.


