News September 20, 2025
HYD: పుట్టినరోజు వేడుకకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

ఆర్టీఏ కమిషనర్, సీనియర్ జర్నలిస్ట్ పీవీ శ్రీనివాస్ మనవరాలి పుట్టినరోజు వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రత్యేకంగా హాజరయ్యారు. బంజారాహిల్స్‌లో వారి కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేక్ కట్ చేసి చిన్నారిని ఆశీర్వదించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారికి చదువులో, జీవితంలో మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News September 21, 2025
ఈ నెల 23న మేడారానికి సీఎం రేవంత్

TG: ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి మేడారం వెళ్లనున్నారు. ఆలయ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో సందర్శించి సమ్మక్క-సారలమ్మ పూజారులను సంప్రదించనున్నారు. వారి ఆమోదంతో అభివృద్ధిపై డిజైన్లను సీఎం రిలీజ్ చేస్తారు. ఈ మేరకు మేడారం అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో ఆయన సమావేశమయ్యారు. <<17659055>>గద్దెలను<<>> యధాతథంగా ఉంచి సంప్రదాయాలను పాటిస్తూ, ఆలయ ప్రాంగణాన్ని మరింత విస్తరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
News September 21, 2025
వనదేవతల గద్దెలు యథాతథం. ప్రాంగణం మాత్రమే విస్తరణ..!

మేడారం వన దేవతల గద్దెల మార్పుపై ఉత్కంఠ వీడింది. వరుస క్రమంలో గద్దెలను మార్చి భక్తులకు దర్శనాన్ని సులభతరం చేయాలనే పూజారుల సూచన మేరకు యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అయితే, ఆదివాసీ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చర్చ మొదలైంది. శనివారం హైదరాబాద్‌లో మంత్రులు, అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి సంప్రదాయాలను పాటిస్తూ గద్దెలను యథాతథంగా ఉంచాలని, ప్రాంగణం విస్తరణకు ప్రణాళిక చేయాలని సూచించారు.
News September 21, 2025
మేడారంలో హరితం.. వెలుగులీననున్న సంప్రదాయం!

కోటిన్నర మంది భక్తుల రాకతో రెండేళ్లకోసారి జనారణ్యంగా మారే మేడారంలో ఆదివాసీలు దైవంలా కొలిచే సంప్రదాయ వృక్షాలు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు వనదేవతల గద్దెలపై ఉండే రావి, జువ్వి, బండారి వంటి జాతుల వృక్షాలు కనుమరుగయ్యాయి. ఈ పరిణామం భక్తుల విశ్వాసాలకు ఇబ్బందిగా మారింది. అయితే.. మేడారం పరిసరాల్లో ఆదివాసీల సంప్రదాయ వృక్షాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం. అలాగే ఇప్ప, వెదురు వనాలను సంరక్షించాలి.