News September 20, 2025

భారత్‌తో మ్యాచ్.. పాక్ డ్రామా షురూ!

image

ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌ మధ్య రేపు సూపర్-4 మ్యాచ్ జరగనుంది. దీంతో ఇవాళ జరగాల్సిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను పాక్ బాయ్‌కాట్ చేసింది. తొలి మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని PCB అలకబూనిన విషయం తెలిసిందే. UAEతో మ్యాచ్ ఆడబోమంటూ పెద్ద <<17741773>>డ్రామానే<<>> చేసింది. చివరికి తోక ముడిచి మ్యాచ్ ఆడింది. రేపటి మ్యాచ్ నేపథ్యంలో మళ్లీ కొత్త నాటకానికి తెరలేపింది. దీంతో ఇరుదేశాల మధ్య ఆట ఉత్కంఠగా మారింది.

Similar News

News January 28, 2026

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 3 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 3న మిర్యాలగూడ, 4న జగిత్యాల, 5న చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లో ప్రచారం చేయనున్నారు. కాగా ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

News January 28, 2026

ప్రమాదాల నుంచి వీళ్లు బయటపడ్డారు!

image

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ <<18980548>>చనిపోవడం<<>> తెలిసిందే. గతంలో పలువురు నేతలు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. MH CM ఫడణవీస్ ఏకంగా 6సార్లు బయటపడ్డారు. 1977లో PM మొరార్జీ దేశాయ్, 2001లో అశోక్ గెహ్లోత్, 2004లో కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, పృథ్వీరాజ్ చవాన్, కుమారి షెల్జా, 2007లో అమరీందర్ సింగ్, 2009లో సుఖ్‌బీర్ సింగ్, 2010లో రాజ్‌నాథ్ సింగ్, 2012లో అర్జున్ ముండా తప్పించుకున్నారు.

News January 28, 2026

బడ్జెట్ సమావేశాల డేట్ ఫిక్స్

image

AP: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నెల 14న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెెెెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 12 వరకు సమావేశాలు కొనసాగే ఆస్కారముంది.