News September 20, 2025
సంగారెడ్డి: జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలి: కలెక్టర్

జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల కోసం భూసేకరణ వేగవంతం చేయాలని చెప్పారు. భూ సేకరణలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ భూముల అనుమతి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News September 21, 2025
మహిళల వన్డే క్రికెట్‌లో సరికొత్త చరిత్ర

నిన్నటి ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా మధ్య జరిగిన <<17776758>>వన్డే<<>> మ్యాచ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉమెన్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇరు జట్లు కలిపి అత్యధిక పరుగులు(781) చేసిన మ్యాచ్‌గా ఇది నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 412 పరుగులు చేయగా, టీమ్ ఇండియా 369 రన్స్ చేసింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లాండ్-దక్షిణాప్రికా(2017లో 678 రన్స్) పేరిట ఉండేది.
News September 21, 2025
NZB: 65 వేలకుపైగా ఉద్యోగాలు కల్పించాం: TPCC చీఫ్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 65 వేలకుపైగా ఉద్యోగాలు కల్పించినట్లు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన గ్రంథాలయ నూతన భవనం, జిల్లా న్యాయస్థానానికి సంబంధించిన భవనాల కోసం ఓల్డ్ డీఈఓ కార్యాలయం సమీపంలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం లైబ్రరీలో నిరుద్యోగులతో మాట్లాడారు. తాజాగా ఆర్టీసీలో ఉద్యోగాల కోసం వెలువడిన నోటిఫికేషన్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News September 21, 2025
సెప్టెంబర్ 21: చరిత్రలో ఈ రోజు

✒ 1862: మహాకవి గురజాడ అప్పారావు జయంతి(ఫొటో)
✒ 1931: దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు జననం
✒ 1939: రచయిత్రి రంగనాయకమ్మ జననం
✒ 1979: విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ జననం
✒ 2003: సినీ నటి కృతి శెట్టి జననం
✒ 2012: తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మరణం
✒ అంతర్జాతీయ శాంతి దినోత్సవం
✒ ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం