News September 20, 2025

నెల్లూరు: DCMS మాజీ ఛైర్మన్ వీరి చలపతి అరెస్ట్!

image

వైసీపీ కీలక నేత, DCMS మాజీ ఛైర్మన్ వీరి చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరులోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి నెల్లూరు రూరల్ DSP కార్యాలయానికి తరలించారు. అయితే ఏ కేసులో అరెస్టు చేశారనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.

Similar News

News September 20, 2025

వీరి చలపతి అరెస్ట్‌తో వైసీపీలో కలకలం

image

నెల్లూరు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి వీరి చలపతిని పోలీసులు శనివారం అరెస్ట్ చేయడంతో జిల్లాలోని వైసీపీ వర్గాల్లో కలకలం రేగింది. జిల్లాలోని వైసీపీ కీలక నేతల్లో అయన ఒకరు. ఈ నేపథ్యంలో అయన అరెస్టయ్యారు. ఇప్పటికే విడవలూరు, కొడవలూరు నుంచి అయన అనుచరులు నెల్లూరుకు చేరుకున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని జిల్లాలో చర్చ జరుగుతోంది.

News September 20, 2025

నెల్లూరు: ఈనెల 22 నుంచి దసరా సెలవులు: DEO

image

ఈనెల 22 నుంచి 11 రోజులపాటు జిల్లాలోని అన్ని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి విద్యార్థులకు సెలవులు ప్రకటించాలని సూచించారు. సెలవు రోజుల్లో ఎవరైనా తరగతులు నిర్వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 20, 2025

నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా మొగిలి వెంకటేశ్వర్లు

image

నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ బదిలీ అయ్యారు. నూతన JC గా మొగిలి వెంకటేశ్వర్లును నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ విజయనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 9 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ క్రమంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా మొగిలి వెంకటేశ్వర్లు నియామకం అయ్యారు.