News April 5, 2024

ప్రముఖ తెలుగు యాంకర్ మృతి

image

ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ HYD యశోద ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. DDలో వార్తలు చదివిన తొలి తెలుగు యాంకర్. ఇప్పటి న్యూస్ రీడర్లు ఎందరికో గురువు. 1978లో న్యూస్ చదవడానికి JOBలో చేరిన ఆయనకు వార్తలు చదివేందుకు 1983 వరకు వేచి చూడాల్సి వచ్చింది. ప్రాంప్టర్ లేని సమయంలో తప్పులు లేకుండా జాగ్రత్తగా ఆయన వార్తలు చదివేవారు. 2011లో పదవీ విరమణ చేశారు.

Similar News

News October 8, 2024

మాపై దాడి చేస్తే ప్రతీకార దాడులు తప్పవు: ఇరాన్

image

తమపై దాడులు చేస్తే ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే అణ్వాయుధాలు ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. కాగా ఇటీవల 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌లోని అణు స్థావరాలు, చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడులకు దిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

News October 8, 2024

టమాటా తెచ్చిన తంటా.. 250 కి.మీ వెంబడించి!

image

ప్రస్తుతం టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడిదే రైతులు, వ్యాపారస్థుల పాలిట శాపంగా మారింది. కర్ణాటకలోని ములుబాగల్‌కు చెందిన ఓ ట్రక్ డ్రైవర్ హైదరాబాద్‌లో టమాటాలు విక్రయించి తిరుగుపయనమయ్యాడు. కర్నూలు సమీపంలో టీ తాగేందుకు ట్రక్ ఆపగా ఓ దొంగల ముఠా టమాటా విక్రయించి వస్తున్న విషయం తెలుసుకుంది. 250 కి.మీ వెంబడించి సోమందేపల్లి వద్ద ట్రక్‌ను ఆపి రూ.5 లక్షలతోపాటు సెల్ ఫోన్ కూడా లాక్కెళ్లిపోయారు.

News October 8, 2024

₹వందల కోట్లు దోచుకోవాలనేదే కాంగ్రెస్ ఆలోచన: జగదీశ్ రెడ్డి

image

TG: హుస్సేన్ సాగర్, మూసీ పాపాలకు కాంగ్రెస్ కారణమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ‘చెరువులపై చర్చకు భట్టి విక్రమార్క సిద్ధమా? గూగుల్ మ్యాప్స్ మొదలైనప్పటి నుంచి చెరువుల పరిస్థితేంటో చూద్దాం. ప్రకటించిన లిస్ట్ ప్రకారం అక్రమ నిర్మాణాలు కూల్చే దమ్ముందా? కూల్చివేతలతో ఇప్పటికే ₹1000కోట్లకు పైగా ప్రజల ఆస్తులకు నష్టం జరిగింది. ₹వందల కోట్లు దోచుకోవాలనేదే కాంగ్రెస్ ఆలోచన’ అని ప్రెస్‌మీట్‌లో ఆరోపించారు.