News September 20, 2025

HYD: బతుకమ్మను జాతీయ పండుగగా గుర్తించాలి: జాజుల

image

బతుకమ్మను జాతీయ పండుగగా గుర్తించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ కోరారు. ఈనెల 24న ట్యాంక్‌బండ్‌ బతుకమ్మ ఘాట్‌ వద్ద నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో పోస్టర్‌ను సంఘం రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గనుల స్రవంతి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

Similar News

News September 21, 2025

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అమూల్య ఎంపిక

image

అనంతపురం జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్ల పరుగులో అద్భుత ప్రదర్శన చూపిన గుంతకల్లుకు చెందిన బి.అమూల్య రాష్ట్రస్థాయి అండర్-20 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఆమె.. ఈనెల 27న ఏలూరులో జరిగే పోటీల్లో అనంతపురం జిల్లా తరఫున పాల్గొననుంది. విజయంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన అమూల్యను పలువురు అభినందించారు.

News September 21, 2025

ఈ గౌరవం నా ఒక్కడిదే కాదు: మోహన్ లాల్

image

దాదాసాహెబ్ ఫాల్కే <<17774717>>అవార్డుకు<<>> ఎంపికవ్వడం నిజంగా గర్వకారణమని నటుడు మోహన్ లాల్ ట్వీట్ చేశారు. ఈ గౌరవం తన ఒక్కడిదే కాదని, తన ప్రయాణంలో పక్కనే ఉండి నడిచినవారిదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, ప్రేక్షకులు, సహచరులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రేమ, నమ్మకం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. డైరెక్టర్ అదూర్ గోపాలకృష్ణన్(2004) తర్వాత మలయాళం నుంచి ఈ అవార్డు అందుకోనున్న రెండో వ్యక్తి మోహన్ లాల్.

News September 21, 2025

వరంగల్: ప్రకృతి పండుగకు పువ్వులు కరవు..!

image

వరంగల్ జిల్లాలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే మహిళల్లో ఎనలేని ఆనందం నెలకొంటుంది. అలాంటి ప్రకృతి పండుగకు పూలే కరవయ్యాయి. నగరాలకు పూల కొరత ఉన్నప్పటికీ కాస్త గ్రామీణ ప్రాంతాల్లో మెరుగ్గానే పూలు దొరికేవి. కానీ, ప్రతి సెంటు భూమి కూడా సాగులోకి రావడంతో తంగేడు, గునుగు కనిపించట్లేదు. బతుకమ్మ పేర్చాలంటే ఈ రెండు రకాల పూలు లేకపోతే మహిళలకు తీసికట్టుగా ఉంటుంది. దీంతో గ్రామాల నుంచి నగరాలకు పూలు తరలి వెళ్తున్నాయి.