News September 20, 2025
అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ విద్యార్థులను కొట్టిన ప్రిన్సిపల్.. డీఈఓ విచారణ
➤ నర్సీపట్నం రూరల్ పిఎస్‌ను తనిఖీ చేసిన విశాఖ రేంజ్ డీఐజీ
➤ జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర
➤ ఇంటి బాట పట్టిన హాస్టల్ విద్యార్థులు
➤ కాశీపురంలో పరిశుభ్రత పాటించని 8 షాపులకు జరిమానా
➤ పోలీస్ సంకల్పంలో భాగంగా విద్యార్థులకు అవగాహన
➤ టీచర్లకు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్‌లు
➤ రైవాడ సాగునీటి కాలువలు అభివృద్ధికి రూ.50 లక్షలు
Similar News
News September 21, 2025
మెదక్: ‘జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు’

జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.
News September 21, 2025
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ పరీక్షలకు 893 మంది విద్యార్థులు

సంగారెడ్డి జిల్లాలో 22 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఓపెన్ స్కూల్ జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి శనివారం తెలిపారు. పదో తరగతికి 272, ఇంటర్‌కు 621, మొత్తం 893 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతికి జడ్పీ బాలికల, ఇంటర్‌కు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News September 21, 2025
H1B వీసాలపై ఆంక్షలు.. ట్విస్ట్ ఏంటంటే?

కొత్తగా H1B వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే <<17767574>>ఫీజు<<>> పెంపు వర్తిస్తుందని వైట్ హౌజ్ అధికారులు చెప్పారని NDTV పేర్కొంది. ప్రస్తుతం ఉన్నవారికి లేదా రెన్యూవల్ చేసుకునే వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని వెల్లడించారని తెలిపింది. కాగా మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు H1B, H-4 వీసాలు ఉన్న తమ ఉద్యోగులను 14 రోజుల పాటు దేశం విడిచి వెళ్లవద్దని, ఇప్పటికే బయట ఉంటే వెంటనే వెనక్కి రావాలని ఆదేశించాయి.