News September 20, 2025

HYD: కొత్త డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుపై హెల్త్ మినిస్టర్ సమీక్ష

image

వైద్య వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో కొత్త డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపై ఉన్నతాధికారులతో ఈరోజు HYDలోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్‌లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కిడ్నీ జబ్బులు, డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. 2009లో ఈ సేవలు ప్రారంభించినప్పుడు 1,230 మంది డయాలసిస్ పేషెంట్లున్నారన్నారు.

Similar News

News September 21, 2025

H1B వీసాలపై ఆంక్షలు.. ట్విస్ట్ ఏంటంటే?

image

కొత్తగా H1B వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే <<17767574>>ఫీజు<<>> పెంపు వర్తిస్తుందని వైట్ హౌజ్ అధికారులు చెప్పారని NDTV పేర్కొంది. ప్రస్తుతం ఉన్నవారికి లేదా రెన్యూవల్ చేసుకునే వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని వెల్లడించారని తెలిపింది. కాగా మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు H1B, H-4 వీసాలు ఉన్న తమ ఉద్యోగులను 14 రోజుల పాటు దేశం విడిచి వెళ్లవద్దని, ఇప్పటికే బయట ఉంటే వెంటనే వెనక్కి రావాలని ఆదేశించాయి.

News September 21, 2025

కామారెడ్డిలో ఈ నెల 23న జాబ్ మేళా

image

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 23వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రజిని కిరణ్ తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు కలెక్టరేట్‌లోని ఉపాధి కల్పన కార్యాలయానికి విద్య అర్హత సర్టిఫికెట్లతో పాటు, ఆధార్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకురావాలన్నారు.

News September 21, 2025

‘రంగు రంగు పూలు తెచ్చి రాశులు పోసి’

image

మహిళా శక్తికి, చైతన్యానికి ప్రతీకగా నిలిచే పండుగ ‘బతుకమ్మ’. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పూల పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రకృతి ఇచ్చిన పూలను దేవతగా భావించి ఆరాధిస్తారు. తొలి రోజును చిన్న బతుకమ్మ లేదా ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. ముందు రోజే సేకరించిన పూలతో బతుకమ్మను తయారు చేయడం, కొన్ని ప్రాంతాల్లో ఆహారం తిన్న తర్వాత తయారు చేయడంతో ఇలా పిలుస్తారని పూర్వీకులు చెబుతారు.