News September 21, 2025
HYD: హత్య కేసు ఛేదన.. క్యాబ్ డ్రైవర్‌కు సత్కారం

HYD కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక సమాచారం అందించిన క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఈరోజు అభినందించారు. కేసు దర్యాప్తులో ధైర్యం చూపించినందుకు ఆయనకు క్యాష్ రివార్డ్ అందజేశారు. బాలానగర్ DCP సురేశ్‌కుమార్‌తోపాటు కూకట్‌పల్లి పోలీస్ సిబ్బందిని కూడా కమిషనర్ ప్రశంసించి నగదు బహుమతి ఇచ్చారు. ప్రజల సహకారంతోనే నేరాలను తగ్గించవచ్చన్నారు.
Similar News
News September 21, 2025
ఎల్లో అలర్ట్.. భారీ వర్షాలు

TGలో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో ద్రోణి ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది.
News September 21, 2025
మెదక్: ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టండి: పీడీ

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పనులు మొదలుపెట్టాలని హౌసింగ్ పీడీ మాణిక్యం సూచించారు. జిల్లాలో 9,156 ఇళ్లు మంజూరు కాగా, 5,511 ఇళ్ల పనులు మొదలయ్యాయన్నారు. ఇందులో ఐదు పూర్తి కాగా బెస్మెంట్ లేవల్‌లో 2,408, లెంటల్ లేవల్‌లో 295, స్లాబ్ లేవల్‌లో 124 ఉన్నాయన్నారు. 2,832 ఇళ్లకు బిల్ జనరేట్ కాగా 2,500 మందికి బిల్లులు జమ అయ్యాయని వివరించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.
News September 21, 2025
లా విద్యార్థులకు విజయవాడలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం

APCRDA కార్యాలయం నుంచి ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్న్‌షిప్ చేసేందుకు 2025లో లా కోర్సు పూర్తి చేసినవారు, ఫైనలియర్ LLB చదివేవారు ఈ నెల 23లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. దరఖాస్తు చేసినవారిలో ఇద్దరిని ఎంపిక చేస్తామని, వివరాలకు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లోని కెరీర్స్ ట్యాబ్ చూడాలని సూచించారు.