News September 21, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* H1B వీసా ఫీజును రూ.88 లక్షలకు పెంచుతూ ట్రంప్ ఉత్తర్వులు
* ట్రంప్ నిర్ణయం ఇరుదేశాలకూ ఇబ్బందికరమన్న భారత్
* ట్రంప్ H1B వీసా నిబంధనలు మోదీ వైఫల్యం: కాంగ్రెస్
* విదేశాలపై ఆధారపడటమే అతిపెద్ద శత్రువు: PM మోదీ
* చెత్తతో పాటు రాజకీయాలనూ క్లీన్ చేస్తా: CM CBN
* మోహన్‌లాల్‌కు దాదా‌సాహెబ్ ఫాల్కే అవార్డ్
* ట్రంప్ నిర్ణయంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం: మంత్రి శ్రీధర్ బాబు

Similar News

News September 21, 2025

కొత్త వారికే H1B వీసా ఫీజు పెంపు: వైట్‌హౌస్ సెక్రటరీ

image

H1B వీసా <<17767574>>ఫీజు<<>> పెంపుపై వైట్‌హౌస్ సెక్రటరీ, ట్రంప్ సలహాదారు కరోలిన్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ వీసాలు ఉండి దేశం వెలుపల ఉంటే తిరిగి ప్రవేశించేందుకు ఏమీ ఛార్జ్ చేయట్లేదని చెప్పారు. వీసాదారులు ఎప్పటిలాగే దేశం విడిచినా, తిరిగొచ్చినా వారిపై కొత్త రూల్స్ ప్రభావం ఉండదని తెలిపారు. కొత్తగా వీసా తీసుకునే వారికే ఇది వర్తిస్తుందని తెలిపారు. ఇది వార్షిక ఫీజు కాదని, మొత్తం ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందన్నారు.

News September 21, 2025

ఎల్లో అలర్ట్.. భారీ వర్షాలు

image

TGలో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో ద్రోణి ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది.

News September 21, 2025

2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనే: రాజ్‌నాథ్

image

ప్రధాని పదవికి బీజేపీలో ఎలాంటి పోటీ లేదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 2029తో పాటు 2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనేనని ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమవ్వడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం, సంక్షోభంలోనూ నిర్ణయాత్మకంగా వ్యవహరించడం మోదీకే చెల్లిందని కొనియాడారు. పహల్గాం ఘటనకు స్పందించిన తీరే దీనికి నిదర్శనమని రాజ్‌నాథ్ అన్నారు.