News September 21, 2025
గంజాయి జోలికెళితే కఠిన చర్యలు: GNT ఎస్పీ

గుంటూరు జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే తమ లక్ష్యమని ఎస్పీ వకూల్ జిందాల్ తెలిపారు. గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గడిచిన 2 రోజుల్లో 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, 22 మందిని అరెస్టు చేశామన్నారు. ఈగల్ టీమ్‌తో సమన్వయం చేసుకుంటూ గంజాయి దందాకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. ఇకపై కార్డెన్ సెర్చ్, వాహనాల తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News September 21, 2025
డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే: కలెక్టర్

అతిసార లక్షణాలున్న ప్రాంతాల్లో 33 బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ నెల 16 నుంచి ఇప్పటివరకు 80 కేసులు నమోదయ్యాయని చెప్పారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిలో 13 మందిని సాధారణ వార్డులకు తరలించామని, 11 మంది డిశ్చార్జ్ అయ్యారని వివరించారు.
News September 21, 2025
కళాతపస్వి కె. విశ్వనాథ్ మన గుంటూరు వాసే

ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన కళాతపస్వి కె. విశ్వనాథ్ ఉమ్మడి గుంటూరు జిల్లా పెదపులివర్రులో జన్మించారు. ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ప్రధామైనవి. 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 2022లో ఏపీ ప్రభుత్వం ద్వారా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.
News September 20, 2025
అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు: DEO

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు DEO సి.వి. రేణుక తెలిపారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు సమాచారాన్ని అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు తెలియజేయాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.