News September 21, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News September 21, 2025
అమ్మవారిని మేల్కొలిపిన పూల పండుగే ‘బతుకమ్మ’

దుర్గాదేవి మహిషాసుర సంహారం తర్వాత అలసి నిద్రలోకి జారుకోగా, భక్తులు ఆమెను మేల్కొల్పడానికి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించారని పండితులు చెబుతున్నారు. గౌరీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన పూలను భక్తులు ఒకచోట పేర్చి ఆమె కోసం ఆరాధనలు, సంకీర్తనలు చేసి, వేడుకున్నారని ప్రతీతి. ఈ భక్తి, అంకితభావానికి మెచ్చి అమ్మవారు మేల్కొన్నారని, అలా బతుకమ్మ పండుగ ఉద్భవించిందని నమ్ముతారు.
News September 21, 2025
అమెరికా ఒక్కటే లేదు బ్రదర్..!

కొత్తగా H1B వీసాపై అమెరికా వెళ్లేవారికి లక్ష డాలర్ల ఫీజు పెంపు వర్తించనుంది. అయితే పూర్తిగా అమెరికాపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ తదితర దేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల కొరత ఉందని, ఆ దేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలని, Aiపై ఎక్కువ ఫోకస్ చేయాలని అంటున్నారు.
News September 21, 2025
ఎంగిలి పూల బతుకమ్మ.. ఏ నైవేద్యం పెట్టాలంటే?

బతుకమ్మ పండుగ మొదటి రోజును ‘ఎంగిలి పూల బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజున నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రత్యేకమైన ప్రసాదం తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని గౌరీ దేవికి సమర్పిస్తారు. ఇది పితృపక్షం మహాలయ అమావాస్య రోజున వస్తుంది. కాబట్టి పూర్వీకులకు తర్పణాలు వదిలి, ఆ తర్వాత ఈ పూజ చేస్తారు. బతుకమ్మ ఆటపాటలు పూర్తయ్యాక, ఈ ప్రసాదాన్ని అందరూ పంచుకుంటారు.