News September 21, 2025
వేయి స్తంభాల గుడిలో వేడుకలు.. హాజరుకానున్న మంత్రులు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలు రేపు వేయిస్తంభాల గుడిలో ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరు కానున్నారు. రాష్ట్ర మహిళలకు మంత్రి కొండా సురేఖ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి సురేఖ తెలిపారు.
Similar News
News September 21, 2025
అమెరికా ఒక్కటే లేదు బ్రదర్..!

కొత్తగా H1B వీసాపై అమెరికా వెళ్లేవారికి లక్ష డాలర్ల ఫీజు పెంపు వర్తించనుంది. అయితే పూర్తిగా అమెరికాపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ తదితర దేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల కొరత ఉందని, ఆ దేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలని, Aiపై ఎక్కువ ఫోకస్ చేయాలని అంటున్నారు.
News September 21, 2025
చెరువులను నీటితో నింపటానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలోని మిగిలిన 206 చెరువులు నీటితో నింపటానికి చర్యలు తీసుకోవాలని, భూగర్భ జలాలను గణనీయంగా పెంచాలని కలెక్టర్ డాక్టర్ సిరి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కర్నూలులోని కలెక్టరేట్‌లో ఇరిగేషన్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News September 21, 2025
ఎంగిలి పూల బతుకమ్మ.. ఏ నైవేద్యం పెట్టాలంటే?

బతుకమ్మ పండుగ మొదటి రోజును ‘ఎంగిలి పూల బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజున నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రత్యేకమైన ప్రసాదం తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని గౌరీ దేవికి సమర్పిస్తారు. ఇది పితృపక్షం మహాలయ అమావాస్య రోజున వస్తుంది. కాబట్టి పూర్వీకులకు తర్పణాలు వదిలి, ఆ తర్వాత ఈ పూజ చేస్తారు. బతుకమ్మ ఆటపాటలు పూర్తయ్యాక, ఈ ప్రసాదాన్ని అందరూ పంచుకుంటారు.