News September 21, 2025

వనదేవతల గద్దెలు యథాతథం. ప్రాంగణం మాత్రమే విస్తరణ..!

image

మేడారం వన దేవతల గద్దెల మార్పుపై ఉత్కంఠ వీడింది. వరుస క్రమంలో గద్దెలను మార్చి భక్తులకు దర్శనాన్ని సులభతరం చేయాలనే పూజారుల సూచన మేరకు యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అయితే, ఆదివాసీ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చర్చ మొదలైంది. శనివారం హైదరాబాద్‌లో మంత్రులు, అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి సంప్రదాయాలను పాటిస్తూ గద్దెలను యథాతథంగా ఉంచాలని, ప్రాంగణం విస్తరణకు ప్రణాళిక చేయాలని సూచించారు.

Similar News

News September 21, 2025

ఎంగిలి పూల బతుకమ్మ.. ఏ నైవేద్యం పెట్టాలంటే?

image

బతుకమ్మ పండుగ మొదటి రోజును ‘ఎంగిలి పూల బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజున నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రత్యేకమైన ప్రసాదం తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని గౌరీ దేవికి సమర్పిస్తారు. ఇది పితృపక్షం మహాలయ అమావాస్య రోజున వస్తుంది. కాబట్టి పూర్వీకులకు తర్పణాలు వదిలి, ఆ తర్వాత ఈ పూజ చేస్తారు. బతుకమ్మ ఆటపాటలు పూర్తయ్యాక, ఈ ప్రసాదాన్ని అందరూ పంచుకుంటారు.

News September 21, 2025

నేడు పాక్‌తో టీమ్ఇండియా సూపర్‌-4 పోరు

image

ఆసియాకప్ 2025లో టీమ్ ఇండియా, పాకిస్థాన్ రెండో సారి తలపడనున్నాయి. గ్రూప్ దశలో అజేయంగా సాగిన సూర్య సేన అదే జోరును సూపర్-4లోనూ కంటిన్యూ చేయాలని చూస్తోంది. భారత స్పిన్ విభాగం పటిష్ఠంగా ఉండగా బ్యాటింగ్‌లో సూర్య, సంజూ, అభిషేక్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అటు పాక్‌ను తక్కువ అంచనా వేయలేం. దుబాయ్ వేదికగా మ్యాచ్ నేడు రా.8 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.

News September 21, 2025

‘ఎంగిలి పూల బతుకమ్మ’ అని ఎందుకు అంటారు?

image

దేవీ నవరాత్రుల సంబురాలు ‘బతుకమ్మ’ రూపంలో ఓరోజు ముందే తెలంగాణలో ప్రారంభమయ్యాయి. అమావాస్య నుంచి అష్టమి దాకా సాగే ఈ ఉత్సవాల్లో తొలిరోజైన నేడు ఎంగిలి పూల బతుకమ్మను పూజిస్తారు. ఈరోజు చాలామంది భోజనం చేసిన తర్వాతే బతుకమ్మను పేరుస్తారు. అలా భోజనం చేయడం వల్ల నోరు ఎంగిలి అవుతుంది కాబట్టి ఆ పేరు వచ్చిందని అంటారు. మరికొందరు పూలను కత్తిరించేందుకు నోరు వాడటంతో పూలు ఎంగిలి అవుతాయని, అందుకే ఇలా అంటారని చెబుతారు.