News September 21, 2025
సెప్టెంబర్ 21: చరిత్రలో ఈ రోజు

✒ 1862: మహాకవి గురజాడ అప్పారావు జయంతి(ఫొటో)
✒ 1931: దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు జననం
✒ 1939: రచయిత్రి రంగనాయకమ్మ జననం
✒ 1979: విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ జననం
✒ 2003: సినీ నటి కృతి శెట్టి జననం
✒ 2012: తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మరణం
✒ అంతర్జాతీయ శాంతి దినోత్సవం
✒ ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం
Similar News
News September 21, 2025
‘అఖండ-2’లో 600 మంది డాన్సర్లతో సాంగ్!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ-2’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. భాను మాస్టర్ కొరియోగ్రఫీలో 600 మంది డాన్సర్లతో ఓ మాస్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారని, దీని కోసం స్పెషల్ సెట్ వేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీలో సంయుక్తా మేనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
News September 21, 2025
రేపటి నుంచి సందడే సందడి..

జీఎస్టీ తగ్గింపు ఫలాలు రేపటి నుంచి దేశ ప్రజలకు అందనున్నాయి. పాలు, సబ్బులు, టూత్ పేస్ట్, దుస్తులు, పుస్తకాలు, పెన్నులు, చెప్పులు, టీవీలు, ఏసీలు, బైకులు, కార్లు, ట్రాక్టర్లు.. ఇలా చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఇప్పటికే చాలా మంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. రేపటి నుంచి షోరూంలు కిటకిటలాడనున్నాయి. మరి మీరు ఏ వస్తువు కొంటున్నారు? కామెంట్ చేయండి.
News September 21, 2025
వరిలో ఎలుకల నివారణకు ఇలా చేయండి

* బ్రోమోడయోలిన్ మందు 10-15 గ్రా.(పిడికెడు నూకలు, కాస్త నూనెతో కలుపుకుని) పొట్లాలుగా కట్టి కన్నానికి ఒకటి చొప్పున పెట్టాలి.
* ఈ మందును 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పెట్టుకోవాలి.
* కన్నాల దగ్గర పొగబారించుకోవడం ద్వారా ఎలుకలను తరిమివేయవచ్చు.
* ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలు పెట్టుకోవాలి.
* ఎలుకలను నిర్మూలించడానికి రైతులు సామూహికంగా చర్యలు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుంది.
<<-se>>#PADDY<<>>