News September 21, 2025
ఈ నెల 24న వైసీపీ కీలక సమావేశం

AP: వైసీపీ చీఫ్ YS జగన్ అధ్యక్షతన ఈ నెల 24న ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, సమన్వయకర్తలు హాజరు కానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 21, 2025
స్థానిక ఎన్నికలు.. ఏం చేద్దాం?

స్థానిక ఎన్నికలపై నిన్న మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ 2, 3 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది. బీసీల రిజర్వేషన్ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంతో స్పెషల్ జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్దామని కొందరు మంత్రులు చెప్పినట్లు సమాచారం. చట్టం వచ్చాకే ఎన్నికలు నిర్వహిద్దామని మరికొందరు అన్నారట. పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేద్దామని పలువురు సూచించినట్లు సమాచారం.
News September 21, 2025
అరటిలో తెగుళ్ల నివారణ, సస్యరక్షణ ఇలా

* సెప్టెంబర్‌లో అరటిలో వైరస్ తెగులు వ్యాప్తి చేసే పేను బంక నివారణకు లీటరు నీటికి మిథైల్‌డెమటాన్ 2ML కలిపి పిచికారీ చేయాలి.
* పచ్చ అరటి, కొవ్వూరు బొంత, కర్పూర చక్కెరకేళి రకాలకు రెండో దఫాగా 100 గ్రా. యూరియా, 80 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇచ్చి తేలికపాటి తడి ఇవ్వాలి.
* నులిపురుగుల నివారణకు పశువుల ఎరువుతోపాటు ఒక్కోమొక్కకు 250 గ్రా. వేపపిండి+ 25 గ్రా. పాసిలోమైసిస్ లిలేసినస్ శిలీంధ్రం వేసుకోవచ్చు.
News September 21, 2025
‘అఖండ-2’లో 600 మంది డాన్సర్లతో సాంగ్!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ-2’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. భాను మాస్టర్ కొరియోగ్రఫీలో 600 మంది డాన్సర్లతో ఓ మాస్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారని, దీని కోసం స్పెషల్ సెట్ వేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీలో సంయుక్తా మేనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.