News September 21, 2025
KMR: రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు 9 నమూనాల ఎంపిక

కామారెడ్డి జిల్లా నుంచి 9 ప్రదర్శనలు రాష్ట్ర స్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్ బోధనాభ్యాసన సామగ్రి మేళాకు ఎంపికైనట్లు DEO రాజు తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఈవీఎస్‌ల నుంచి రెండేసి, ఉర్దూ నుంచి ఒక ప్రదర్శన ఎంపికయ్యాయన్నారు. జిల్లాకు ఈ ఘనత సాధించిపెట్టిన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఈ ప్రదర్శనలు జిల్లా విద్యా ప్రమాణాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 21, 2025
ఏలూరు: తగ్గని చికెన్ ధరలు

నూజివీడులో మాంసం ధరలు తగ్గకపోవడంతో మాంసప్రియలు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. మటన్ కిలో రూ.800, చికెన్ కిలో రూ.200, చేపలు కిలో రూ.160-300, రొయ్యలు కిలో రూ.300కి అమ్ముతున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో మటన్ కిలో రూ.900, చికెన్ కిలో రూ.220, చేపలు కిలో రూ.180కి విక్రయిస్తున్నట్లు తెలిసింది. మరి మీ ప్రాంతంలో ఎలా ఉన్నాయో కామెంట్.
News September 21, 2025
తెలంగాణ న్యూస్ అప్‌డేట్స్

* వరంగల్ వేయి స్తంభాల గుడిలో నేడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బతుకమ్మ వేడుకలు.. హాజరుకానున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జూపల్లి
* ఈ నెలలో రాష్ట్రానికి అదనంగా 1.17 లక్షల టన్నుల యూరియా: మంత్రి తుమ్మల
* ప్రతి 20kmలకు ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించండి: మంత్రి దామోదర రాజనర్సింహ
* సొంతూరు చింతమడకలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్న జాగృతి చీఫ్ కవిత
News September 21, 2025
వరంగల్: పితృ అమావాస్యనే పెత్రమాస..!

బతుకమ్మ పండుగ ప్రారంభమయ్యే తొలి రోజున పెత్రమాస అంటే పితృ అమావాస్యగా పిలుస్తారు. దీనినే మహాలయ అమావాస్యగా కూడా చెబుతారు. వరంగల్ జిల్లా వాసుల కుటుంబాల్లో చనిపోయిన వ్యక్తులను గుర్తుచేసుకొని వారికి తర్పణం లాంటి కార్యక్రమాల్లో భాగంగా వేద పండితులకు బియ్యం, పప్పు, ఉప్పు సామాగ్రి ఇచ్చి తమ పితృ దేవుళ్లకు ఇచ్చినట్లుగా వారి పేర్లను చదివిపిస్తారు. ఈ రోజునే పితృదేవతలు కూడా భూమి మీదకు వస్తారనే నమ్ముతారు.