News September 21, 2025

కామారెడ్డిలో ఈ నెల 23న జాబ్ మేళా

image

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 23వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రజిని కిరణ్ తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు కలెక్టరేట్‌లోని ఉపాధి కల్పన కార్యాలయానికి విద్య అర్హత సర్టిఫికెట్లతో పాటు, ఆధార్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకురావాలన్నారు.

Similar News

News September 21, 2025

కొత్తగూడెం: సింగరేణి అధికారుల బదిలీ

image

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి మైనింగ్ విభాగంలో పనిచేస్తున్న 31 మంది అధికారులను బదిలీ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్మెంట్ సెల్ అధికారులు ఆర్డర్స్ ఇచ్చారు. బదిలీ అయిన వారిలో ఏజీఎం మొదలుకొని మేనేజర్ స్థాయి వరకు అధికారులు ఉన్నారు. కాగా ఈనెల 27వ తేదీలోగా కేటాయించిన స్థానాల్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News September 21, 2025

మండోదరి పాత్రలో పూనమ్.. వ్యతిరేకిస్తున్న BJP, VHP!

image

ఢిల్లీలో జరిగే ‘రామ్‌లీల’ ఈవెంట్‌లో రావణుడి భార్య మండోదరి పాత్రలో నటించేందుకు పూనమ్ పాండేను తీసుకోవడంపై స్థానిక BJP, VHP నేతలు అభ్యంతరం తెలిపారు. ఆమెను మరొకరితో రీప్లేస్ చేయాలని లవ్‌కుశ్ రామ్‌లీల కమిటీని కోరారు. పూనమ్ తన ఫొటోలు, వీడియోలతో ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ చేశారని గుర్తుచేశారు. అయితే ఇందులో తమకు ఏ తప్పూ కనిపించలేదని, ప్రతి ఒక్కరూ అవకాశం పొందేందుకు అర్హులని కమిటీ ప్రెసిడెంట్ బదులిచ్చారు.

News September 21, 2025

శ్రీకాకుళం: చికెన్ ధరలకు రెక్కలు

image

దసరా పండుగ సీజన్ ఆగమనంతో శ్రీకాకుళంలో చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం చికెన్ ధరలు భారీగా పెరిగాయి. చికెన్ కేజీ రూ.280, స్కిన్ లెస్ రూ.290-300 పలుకుతోంది. ఇది గత వారంతో పోలిస్తే రూ.20-30 వరకు పెరిగింది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.