News September 21, 2025
H1B వీసాలపై ఆంక్షలు.. ట్విస్ట్ ఏంటంటే?

కొత్తగా H1B వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే <<17767574>>ఫీజు<<>> పెంపు వర్తిస్తుందని వైట్ హౌజ్ అధికారులు చెప్పారని NDTV పేర్కొంది. ప్రస్తుతం ఉన్నవారికి లేదా రెన్యూవల్ చేసుకునే వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని వెల్లడించారని తెలిపింది. కాగా మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు H1B, H-4 వీసాలు ఉన్న తమ ఉద్యోగులను 14 రోజుల పాటు దేశం విడిచి వెళ్లవద్దని, ఇప్పటికే బయట ఉంటే వెంటనే వెనక్కి రావాలని ఆదేశించాయి.
Similar News
News September 21, 2025
మండోదరి పాత్రలో పూనమ్.. వ్యతిరేకిస్తున్న BJP, VHP!

ఢిల్లీలో జరిగే ‘రామ్‌లీల’ ఈవెంట్‌లో రావణుడి భార్య మండోదరి పాత్రలో నటించేందుకు పూనమ్ పాండేను తీసుకోవడంపై స్థానిక BJP, VHP నేతలు అభ్యంతరం తెలిపారు. ఆమెను మరొకరితో రీప్లేస్ చేయాలని లవ్‌కుశ్ రామ్‌లీల కమిటీని కోరారు. పూనమ్ తన ఫొటోలు, వీడియోలతో ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ చేశారని గుర్తుచేశారు. అయితే ఇందులో తమకు ఏ తప్పూ కనిపించలేదని, ప్రతి ఒక్కరూ అవకాశం పొందేందుకు అర్హులని కమిటీ ప్రెసిడెంట్ బదులిచ్చారు.
News September 21, 2025
APSRTCలో 281 ఉద్యోగాలు

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. APSRTCలో 281 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం రీజియన్లలో డీజిల్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్ ఉద్యోగాలున్నాయి. టెన్త్, సంబంధిత ట్రేడుల్లో ITI ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ OCT 4. పూర్తి వివరాల కోసం <
#ShareIt
News September 21, 2025
తెలుగులో జీవోలు.. ఇలా చూసేయండి!

AP: రాష్ట్ర ప్రభుత్వం నిన్న GST సవరణలకు సంబంధించిన 11 జీవోలను ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ అప్‌లోడ్ చేసింది. ప్రజలకు అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వ కార్యకలాపాలను చేరువ చేసేందుకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. <